
బనశంకరి : బెంగళూరులో ఓ మహిళా కండక్టర్ పై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాగలగుంటె పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే...హవనూరు లేఅవుట్‌లో నివాసముంటున్న ఇందిరాబాయి పీణ్యా 9వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 5.45 గంటలకు ఇంటి నుంచి డిపోకి నడిచి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ చల్లి పరారయ్యారు. దాడిలో ఆమె ముఖం, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందిరాబాయి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాగలగుంటె పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment