
జరుగుమల్లి (సింగరాయకొండ): మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో శుక్రవారం జరిగింది. కామేపల్లికి చెందిన ప్రత్తిపాటి హరిబాబు మద్యం తాగి గ్రామంలోని షాపుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరు రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
వారు గద్దించడంతో అటుగా వస్తున్న టంగుటూరు–కామేపల్లి ఆర్టీసీ బస్సు ఎదుట అడ్డంగా పడుకున్నాడు. కండక్టర్ సుభాష్ ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసేందుకు ప్రయతి్నంచగా ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. సుధారాణి కిందపడిపోగా ఆమె ఛాతీపై తన్నాడు.
అనంతరం తన చేతికి చిన్న గాయమైందని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హరిబాబు ఆయా డ్రస్సింగ్ చేస్తుండగా డాక్టర్ ఎక్కడ అని కేకలేస్తూ ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు, ఫరి్నచర్ ధ్వంసం చేశాడు. డాక్టర్ రేష్మి ఫిర్యాదు మేరకు జరుగుమల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. కండక్టర్ సుహాసినిని ప్రథమ చికిత్స అనంతరం కందుకూరు ఏరియా ఆస్పత్రికిపంపించారు.

Comments
Please login to add a commentAdd a comment