అన్నన్నా.. కోడ్‌ ఉందన్నా.. | TDP Party Violating Election Code By Giving Photos Of Leaders On canteen | Sakshi
Sakshi News home page

అన్నన్నా.. కోడ్‌ ఉందన్నా..

Published Wed, Mar 6 2019 11:45 AM | Last Updated on Wed, Mar 6 2019 11:45 AM

TDP Party Violating Election Code By Giving Photos Of Leaders On canteen - Sakshi

అన్న క్యాంటీన్‌లపై ఉన్న ఎన్టీఆర్, చంద్రబాబు, ఎమ్మెల్యే ఆలపాటి చిత్రపటాలు, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఎన్టీఆర్‌ విగ్రహం

సాక్షి, తెనాలిరూరల్‌: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా, అధికారులకు పట్టడంలేదు. అధికార పార్టీకి అనుచరులుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట, మార్కెట్‌ కాంప్లెక్స్‌ ముందు ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి ముసుగు వేయకుండా వదిలేశారు. ఇక దాని వెంబడి ఉన్న అన్న క్యాంటీన్, ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక, మార్కెట్‌ యార్డు ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ల గాడలపై ఎన్టీఆర్, చంద్రబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ చిత్రపటాలను కూడా అలాగే వదిలేశారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుటనే ఇలా కోడ్‌ ఉల్లంఘన జరుతుండడంపై ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement