Code violations
-
మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మాటలు, విమర్శలపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఎన్నికల కోడ్ అతిక్రమించి ఎవరైనా మాట్లాడితే వారికి నోటీసులు ఇస్తోంది. కొందరిపై ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటోంది. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. నిన్న(మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్‌పై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై వ్యాఖ్యలకు రేపు ఉదయం 11 గంటల వరకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌లపై నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
టీడీపీ కోడ్ ఉల్లంఘన
ఇచ్ఛాపురం రూరల్: ఓ వైపు ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్న టీడీపీ నేతలు మరోవైపు పల్లెల్లో స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల టీడీపీ నేతలైతే ఏకంగా అమ్మవారి ఆలయాన్నే తమ సమావేశానికి వేదికగా ఉపయోగించుకున్నారు. గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో ఎన్నికల సమావేశాలు నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఇచ్ఛాపురంలోని ‘స్వేచ్ఛావతి అమ్మవారు ఆలయం’లో శనివారం టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించి కోడ్‌ను ఉల్లంఘించారు. సమావేశానికి అనుమతిచ్చిన కమిటీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో.. చంద్రబాబు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇచ్ఛాపురం మండలంలో 13 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసి ప్రచారం చేయాలని తీర్మానించారు. -
ఇక కదలాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసిపోనుంది. జీహెచ్ఎంసీలో ఎంతోకాలంగా చతికిల పడ్డ అభివృద్ధి పనులు ఇకనైనా చకచకా ముందుకెళ్తాయా అంటే..అవునని కచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుతం ఫలితాలు వెలువడ్డ లోక్‌సభ ఎన్నికలు..ఈ రెండింటి నడుమ వచ్చిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఎనిమిది మాసాలుగా జీహెచ్ఎంసీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలకందాల్సిన సేవలు కూడా అందడం లేదు. అందుకు కారణం అభివృద్ధి పనులకు ఎన్నికల కోడ్ ఆటంకం కాగా, జీహెచ్ఎంసీలోని సిబ్బందే ఎన్నికల విధుల్లోనూ పాల్గొనడంతో ఆయా విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. సాధారణంగా అత్యవసర సేవలందించే విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులుండకూడదు కానీ పారిశుధ్యం వంటి అత్యవసర సేవల విభాగాల్లోని సిబ్బందికి సైతం ఎన్నికల విధులు పడ్డాయి. జీహెచ్ఎంసీలోని దిగువస్థాయి సిబ్బంది నుంచి మొదలు పెడితే అడిషనల్, జోనల్ కమిషనర్లతోపాటు కమిషనర్ వరకు ఎన్నికల విధులు నిర్వహించారు. దీంతో, ఉన్నతాధికారులతో పాటు దిగువస్థాయి సిబ్బంది ఎన్నికల విధుల్లోనే తలమునకలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ల నుంచి మొదలు పెడితే ఫలితాలు వెలువడేంతవరకు వివిధ రకాల శిక్షణలు, ఎన్నికల నిర్వహణ తదితర పనులతో సరిపోయింది. దీంతో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్లు, రహదారుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ తదితర పనులెన్నో ఆగిపోయాయి. ముందుకు సాగని అభివృద్ధి పనులు... వీటితోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందగించింది. నగరంలో నిర్మించే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడో మంజూరైనప్పటికీ, ఎన్నికల కారణంగా నిర్మాణ కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లడం.. ప్రభుత్వం నుంచి తగిన నిధులందకపోవడం తదితర పరిణామాలతో వీటి నిర్మాణం కుంటుపడింది. పూర్తవుతున్న ఇళ్లకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగకపోవడం వల్ల కూడా పనులు ముందుకు సాగడం లేవు. పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాల పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. ఆయా మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం లక్ష ఇళ్లకు వెరసి దాదాపు రూ.616 కోట్లు ఖర్చవుతుందని ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. కానీ..ప్రభుత్వం అందుకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. టెండర్లలో రూ.3500 కోట్ల పనులు.. ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వేల కోట్ల విలువైనవి టెండర్ల దశలో ఆగిపోయాయి. దాదాపు రూ. 25వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించిన ఎస్సార్డీపీ పనుల్లో దాదాపు వెయ్యికోట్ల మేర పనులు జరిగాయి. టెండర్లు పూర్తికావాల్సిన పనులు, టెండర్లు పిలవాల్సినవి దాదాపు రూ. 3500 కోట్ల పనులున్నాయి. ఇవి కాక పరిపాలనపర అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి మరో రూ.1500 కోట్ల మేర ఉన్నాయి. వెరసి దాదాపు రూ.5000 కోట్ల పనులు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. కోడ్ ముగిసింది సరే..నిధులేవీ..? ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అంటూ ఆయా పనులను నిలిపివేశారు. ఇప్పుడైనా చకచకా ముందుకెళ్తాయా అంటే..అవుననే పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నుంచే నిధులు రావాల్సి ఉంది. విడతల వారీగా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ దాదాపు రూ. 400 కోట్లు పెండింగ్‌లోనే ఉంటుండటంతో పనులు చురుగ్గా సాగడం లేవు. ఇక ఎస్పార్‌డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా సేకరించడమో, బ్యాంకు రుణాలు తీసుకోవడమో చేయాల్సి ఉంది. గత ఏప్రిల్ నుంచే బాండ్ల ద్వారా నిధులు సేకరించాలనుకుంటున్నప్పటికీ, బాండ్ల మార్కెట్ పరిస్థితి బాగులేకపోవడంతో తక్కువ వడ్డీకి ముందుకు వచ్చే వారుండరనే అంచనాతో వెనుకడుగు వేస్తున్నారు. పరిస్థితి మెరుగయ్యాక బాండ్లకు వెళ్లాలనుకున్నారు. కేంద్ర ఎన్నికల ఫలితాలు కూడా వెలువడటంతో ఇప్పుడిక బాండ్ల çమార్కెట్ ³పరిస్థితిని పరిశీలించి వచ్చే వారం నుంచి దీనికి సంబంధించిన కసరత్తు చేపట్టాలని భావిస్తున్నారు. ఎంత లేదన్నా మునిసిపల్ బాండ్ల ద్వారా నిధుల సేకరణకు మరో నెల రోజులు పడుతుంది. బాండ్లు కాకపోయినా, బ్యాంకు రుణాల ద్వారా సేకరించాలనుకున్నా వీలైనంత తక్కువ వడ్డీకి రుణం పొందేందుకు అవసరమైన ప్రక్రియలు పూర్తిచేసి, రుణం పొందేందుకు సైతం నెలరోజులు పడుతుంది. జీహెచ్ఎంసీ ఖజానాలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేన్ని నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అంటూ నెట్టుకొచ్చినప్పటికీ, ఇప్పుడైనా వెంటనే పనులు స్పీడందుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిలిచిపోయిన పనులు.. ♦ శిల్పా లేఔట్– గచ్చిబౌలి ఫ్లై ఓవర్ : రూ. 330 కోట్లు ♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్: రూ. 175 కోట్లు ♦ ఆరాంఘర్–జూపార్క్ ఫ్లై ఓవర్:రూ. 326 కోట్లు ♦ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ :రూ. 30 కోట్లు ♦ ఇందిరా>పార్కు– వీఎస్టీ స్టీల్‌బ్రిడ్జి : రూ. 426 కోట్లు ♦ నల్లగొండ క్రాస్‌రోడ్ –ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్: రూ. 526 కోట్లు ♦ కైత్లాపూర్ వద్ద ఆర్ఓబీ : రూ. 83 కోట్లు ♦ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు కొనసాగింపు, గ్రేడ్‌సెపరేటర్లు: రూ. 300 కోట్లు ♦ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ పొడిగింపు పనులు -
ఈసీ కొరడా!
ఎన్నికల సమయంలో ఇష్టానుసారం మాట్లాడే నాయకుల తీరువల్ల దేశంలో వాతావరణం కలుషితమవుతున్నదని వాపోయే పౌరులకు ఉపశమనం కలిగే పరిణామాలు సోమవారం చోటుచేసుకున్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే నాయకుల విషయంలో కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఎన్నికల సంఘం(ఈసీ)ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రస్తుతం ఉన్న అధికారాలేమిటో సమీక్షించదల్చుకున్నామని చెప్పింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఎన్నికల సంఘం వేగంగా స్పందించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్, కేంద్ర మంత్రి మేనకాగాంధీలపై కఠిన చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్, ఆజంఖాన్‌లు 3 రోజులపాటు... మాయావతి, మేనకాగాంధీలు 2 రోజులపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆంక్షలు విధించింది. వీరంతా నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగసభలు, రోడ్‌షోలు, విలేకరుల సమావేశాలు వగైరాల్లో పాల్గొనకూడదు. ఎన్నికల బరిలో అభ్యర్థులుగా లేదా స్టార్ కాంపెయినర్లుగా ఉన్న ఈ నాయకులు ఈ కీలక ఘట్టంలో మూగనోము పట్టవలసిరావడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు. ప్రజలకు మాత్రం మేలే జరిగింది. పరస్పరం విమర్శించుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ఎన్నికల సమ యంలో సర్వసాధారణం. కానీ కొన్నేళ్లుగా ఇదంతా మారింది. ప్రత్యర్ధులపై వ్యక్తిగత దూషణలకు దిగడం, ఎంతటి తీవ్రమైన తప్పుడు ఆరోపణలనైనా అలవోకగా చేయడం నాయకులకు అలవాటై పోయింది. ఇటీవల బీజేపీలో చేరి తనపై పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ రెండురోజులక్రితం అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ పది పన్నెండురోజుల క్రితం మన సైనిక దళాలను ‘మోదీ సైన్యం’గా అభివర్ణించి అందరినీ విస్మయపరి చారు. దానిపై ఎన్నికల సంఘం స్పందించి నోటీసులు జారీచేసినా ఆయనగారి ధోరణి మారలేదు. ‘విపక్షం దగ్గర అలీ ఉంటే...మన దగ్గర బజరంగ్‌బలి ఉన్నారు’ అని మాట్లాడారు. అటు మాయావతి ముస్లింలంతా ఎస్పీ–బీఎస్పీ కూటమికి ఓటేయాలని నేరుగా పిలుపునిచ్చారు. చిత్రమేమంటే వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉన్నట్టు కనబడే మేనకాగాంధీ తీరు కూడా ఈ ఎన్నికల్లో మారింది. ఒక సభలో ఆమె ముస్లింలనుద్దేశించి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. ‘నాకు ఓటేయకపోతే నష్టపోయేది మీరే’ అంటూ హెచ్చరించారు. ఇది ఒక్క ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అన్నిచోట్లా ఇదే ధోరణి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాలు ఇందుకు ఉదాహరణ. వీరి నోటి వెంబడి ‘తోకలు కత్తిరిస్తా...పిచ్చిపిచ్చిగా ఉందా... తోలుతీస్తా’ వగైరా బెదిరింపులు పుంఖానుపుంఖాలుగా వెలువడేవి. రాయలసీమ ప్రజలను, ప్రత్యేకించి పులివెందుల ప్రజలను ఆ ఇద్దరు నేతలూ తరచు అవమానిస్తూ మాట్లాడారు. డాంబికా లకు పోతే జనం తమను హీరోలనుకుంటారని, అమాయకంగా నమ్మి ఓట్లు కుమ్మరిస్తారని వీరి నమ్మకం. కానీ ‘అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక’ అన్నట్టు ఈ నాయకుల సంగతి తెలియనిదెవరికి? చంద్రబాబు పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఏం మాట్లాడుతున్నారో కూడా స్పహలేనట్టు వ్యవహరిం చారు. వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డిని దుర్భాషలాడారు. ‘నా ఆస్తి లక్ష కోట్లు’ అని, ‘ప్రజలకు డబ్బులు పంచుదామంటే ఆదాయం పన్ను విభాగం దాడులవల్ల సాధ్యపడలేద’ని నోరు జారారు. సొంత డబ్బు ఇవ్వలేకపోవడంతో ప్రభుత్వ సొమ్ముని పంచానని చెప్పేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం బాబు నైజానికి ఉదాహరణ. ఆ కేసు గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంక్షలు విధించింది. కానీ ఇలాంటి సూచనలు, ఆంక్షలు చంద్రబాబు ముందు పనిచేయవు. తనకు మేలు జరుగుతుందనుకుంటే ఆయన ఎంతకైనా తెగిస్తారు. ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఈ నేతలందరినీ ఓ కంట కనిపెట్టి ఉండటం కష్టం కదా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. అయితే దానికి అవసరమైన మందీమార్బలం సంఘం దగ్గరుంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 84,441మంది వీడియోగ్రాఫర్లను, 66,640మంది ఫొటోగ్రాఫర్లను సంఘం వినియోగించింది. వీరంతా సంచార నిఘా సిబ్బందితోపాటు నియోజకవర్గాల్లో పనిచేశారు. నాయకుల ప్రసంగాలను చిత్రీకరించడం, ఫొటోలు తీయడం వీరి పని. అల్లర్లు జరిగే అవకాశం ఉండే కేంద్రాలవద్ద పోలింగ్‌నాడు ఈ వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు నిశితంగా గమనిస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో ఈ సిబ్బంది సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. వీరుగాక 24 గంటలపాటు వార్తలు అందజేసే వార్తా చానెళ్లు వచ్చాయి. అయితే విషాదమేమంటే నాయకులపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. తనంత తాను చర్యలు తీసుకోవడం మాట అటుంచి ఫిర్యాదు చేసినా వెనువెంటనే కదలడం లేదు. బాబు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా నియమావళి ఉల్లంఘన కిందికొస్తాయి. అయినా చర్యలు లేవు. సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని నిలదీసింది ఇలాంటి అలసత్వం గురించే. తమకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని ఎన్నికల సంఘం చేసిన వాదనను కూడా సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించినట్టు లేదు. ఆ అధికారాలేమిటో తాము సమీక్షిస్తామన్నది. అందుకే కావొచ్చు...నోటీసులతో, మందలింపులతో సరిపుచ్చే వైఖరిని మార్చుకు ని ఎన్నికల సంఘం వెనువెంటనే కఠిన చర్యలకు దిగింది. ‘చూస్తూ ఉంటే...మేస్తూ పోయాడ’న్నట్టు ఊరుకున్నకొద్దీ నాయకుల వాచాలత్వం శ్రుతి మించుతోంది. ఇందువల్ల ఎన్నికల ప్రక్రియ మొత్తం నవ్వులపాలవుతోంది. తాజా చర్యలతోనైనా పరిస్థితి మెరుగుపడితే జనం సంతోషిస్తారు. -
మంగళగిరిలో భారీగా డబ్బుల పంపిణీ
-
విశాఖలో వాహనాల తనిఖీలు ,49 లక్షలు స్వాధీనం
-
చంద్రగిరిలో టీడీపీ ప్రలోభాల పర్వం
-
టీడీపీ కార్యకర్త ఇంట్లో రూ.40 లక్షలు స్వాధీనం
-
టీడీపీ ప్రలోభాలు,మద్యం బాటిళ్లు స్వాధీనం
-
విశాఖలో బరితెగించిన టీడీపీ నాయకులు
-
డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు
-
పచ్చనేతల బరితెగింపు
గాజువాక: అది సామాజిక భవనమన్న స్పృహ లేదు. ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఆలోచన లేదు. అన్నింటికీ మించి ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న భయం లేదు. ఏ అధికారి కొమ్ము కాస్తున్నాడో... ఏ ప్రజాప్రతినిధి వెనక నుంచి నడిపిస్తున్నాడో కానీ... ఒక సామాజిక భవనాన్ని టీడీపీ నాయకులు ఏకంగా తమ పార్టీ కార్యాలయంగా మార్చేయడానికి ఉపక్రమించారు. సామాజిక భవనాన్ని కొద్దిరోజులుగా తమ ఆక్రమణలోకి తీసుకున్న పచ్చబాబులు తాజాగా పసుపురంగు వేసి ఆ భవనం తమది అన్నట్టు చెప్పుకొంటున్నారు. 20 రోజుల క్రితం భవనం ప్రహరీకూలగొడుతున్న కూలీ (ఫైల్) ప్రహరీ కూలగొట్టి... రంగులు మార్చి జీవీఎంసీ 60వ వార్డులోని పాత గాజువాక దరి చిట్టినాయుడు కాలనీలో సుమారు 700 చదరపు గజాల స్థలంలో జీవీఎంసీ ఒక సామాజిక భవనాన్ని నిర్మించింది. దానికి సుమారు ఏడేళ్ల క్రితం రూ.10 లక్షలతో చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు. ప్రస్తుతం దాన్ని స్థానికులు తమ శుభకార్యాలకు, ఇతర సాంఘిక అవసరాలకు ఉపయోగించుకొంటున్నారు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పథకం వేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కొద్ది కాలం క్రితం ఎన్టీ రామారావుకు చెందిన విగ్రహాన్ని పెట్టించి భవనాన్ని తన ఆక్రమణలోకి తీసుకున్నాడు. 20 రోజుల క్రితం కొంతమంది కూలీలతో ప్రహరీ పడగొట్టించి తన అవసరాలకు అనుకూలంగా పునర్నిర్మించాడు. ఈ విషయంపై జీవీఎంసీ గాజువాక జోనల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. కనీసం ఆ పనులను ఆపలేదు. దీంతో దూకుడు పెంచిన ఆక్రమణదారుడు ఇప్పుడు ఏకంగా ఆ సామాజిక భవనానికి పసుపురంగు వేసి టీడీపీ కార్యాలయంగా మార్చడానికి అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనని తెలిసినా ఏ అధికారీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఎన్నికల సంఘం యాప్ సీ విజిల్లో స్థానికులు ఫిర్యాదు చేయగా, సంబంధిత సిబ్బంది పరిశీలించి వెళ్లినట్టు సమాచారం. -
దీని భావమేమి తిరుమలేశా..
సాక్షి, కడప : ఇంతకాలం ఓటుకు నోటు మాత్రమే చూశాం. మైదుకూరు ఓటర్లకు ఇప్పుడు దేవదేవుని దర్శనం కూడా ఉచితంగా లభిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమల వెంకన్న దర్శనం టోకెన్లు విచ్చలవిడిగా జారీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ కావడమే అందుకు కారణం. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా యంత్రాంగం చూస్తుండిపోయింది. ప్రలోభాలను కట్టడి చేయాలనే కనీస స్పృహ లోపించింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ టీటీడీ చైర్మనుగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు టీటీడీ చైర్మనుగా కొనసాగే సాంప్రదాయం లేదు. కొనసాగినా దేవదేవుని దర్శనం ఎన్నికల నిమిత్తం వాడుకోరాదు. మైదుకూరులో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. విస్తృత ప్రచారంలో ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్ ఓటర్లకు దర్శనం సౌలభ్యం కల్పిస్తున్నారు. రోజూ మైదుకూరు నుంచి వందల సంఖ్యలో ఓటర్లు దర్శనానికి రలివెళ్తున్నారు. శ్రీవారి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లతో పాటు పదుల సంఖ్యలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను జారీ చేస్తూ ఓటర్లను పబ్లిక్‌గా ప్రలోభానికి గురిచేస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎన్నికల కమిషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నికలకు నోటిషికేషన్ విడుదులైన వెంటనే టీటీడీ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖల స్వీకరణను రద్దు చేసేవారు. గతేడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సిఫార్సు లేఖలను రద్దు చేశారు. ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో టీటీడీ యంత్రాంగంతీరు వివాదస్పదమైంది. సిఫార్సు లెటర్లు రద్దు చేసినట్లుగా టీటీడీ ప్రకటించినా చైర్మన్ కార్యాలయం నుంచి వెళ్తున్న సిఫార్సులకు శ్రీవారి దర్శనాలు కల్పించడం విశేషం. నిబంధనలు భేఖాతర్.. ఎన్నికలలో పోటీచేసే టీటీడీ సభ్యుల నామినేషన్ తిరస్కరణ గురవుతుందని, తెలంగాణకు చెందిన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్యచేత గతంలో ఆ పదవికి రాజీనామా చేయించారు. చైర్మనుగా సుధాకర్‌యాదవ్ రాజీనామా సమర్పించలేదు. ఇది ఎన్నికల నియామావళికి విరుద్దం. మైదుకూరు నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవారి దర్శనం ఎరగా చూపుతుండటం విశేషం. వైఎస్సార్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి హరికిరణ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా టీటీడీ వీఐపీ లేఖల సిఫార్సు ఆధారంగా దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. దర్శనాలు కేటాయిస్తే టీటీడీ యంత్రాంగం కోడ్ ఉల్లంఘించినట్లేనని తెలిపారు. వాస్తవాలు విచారించాల్సి ఉందని వివరించారు. -
ఆన్లైన్ మనీపై నిఘా!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల్లో ఎన్నికల అధికారుల కళ్లు గప్పేందుకు వివిధ పార్టీలు.. నేతలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సంఘాల సభ్యుల బ్యాంకు పాస్బుక్ల జిరాక్స్ ప్రతులు సేకరించి వారి ఖాతాలకు కొందరు సొమ్ము పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా సొమ్ము పంపిణీ చేసినా తెలుసుకునేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) జయరాజ్ కెనెడీ, ఎన్నికల వ్యయం నోడల్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ వెంకటేశ్వర్‌రెడ్డి, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ వివరాలను అధికారులు వెల్లడించారు. నివేదికలు అందించాలి.. రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకైనా సరే ఏకకాలంలో ఎక్కువ మందికి ఒకే ఖాతానుంచి పంపిణీ జరిగినా, ఒకే రోజు దాదాపు రూ.10 లక్షల నగదు విత్‌డ్రా చేసుకున్నా సదరు వివరాలను తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయపు పన్ను అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. నేరుగా డబ్బు పంపిణీ చేస్తే పట్టుబడతామనే యోచనతో కొందరు ఇలా చేసే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌లోని అన్ని జాతీయ, షెడ్యూల్డ్, ప్రైవేట్ బ్యాంకులు తమ బ్యాంకు నుంచి జరిగిన నగదు పంపిణీ, విత్‌డ్రాలకు సంబంధించి ఏమాత్రం అనుమానం ఉన్నా సదరు వివరాలను ఏరోజుకారోజు తెలియజేయాల్సి అవసరముంది. ఆయా అంశాలకు సంబంధించి ప్రతిరోజూ నివేదిక పంపించాలని, అనుమానాస్పద లావాదేవీలు లేని పక్షంలో ఆ వివరాలనూ తెలియజేయాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతిరోజూ ఈ నివేదిక పంపించడడం తప్పనిసరి. లేని పక్షంలో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణిస్తుంది. అలాంటి బ్యాంకులపై విచారణ జరపడంతో పాటు విచారణలో బ్యాంకర్లు ఏ అభ్యర్థితోనైనా లేదా రాజకీయ పార్టీతోనైనా కుమ్మక్కైనట్లు గుర్తిస్తే ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుంది. అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చు చేయకుండా నివారించేందుకూ ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఎన్నికల వ్యయం నమోదు చేసేందుకుగాను బ్యాంకులు అభ్యర్థులతో ఎన్నికల ఖర్చు కోసమే ప్రత్యేకంగా కొత్త ఖాతా తెరిపించి, చెక్‌బుక్ ఇవ్వాల్సిన అవసరముంది. -
ఈ డబ్బు ఎవరి కోసం?
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక భారీమొత్తం నగదు, అది కూడా ఒక ప్రభుత్వ ఇంజనీర్ వద్ద దొరికింది. బెంగళూరులో కొందరు రాజకీయ పెద్దలకు ఇవ్వడానికని ఆ నగదును తెచ్చినట్లు సమాచారం. అది ఎవరి కోసమన్నది సస్పెన్స్ సాక్షి, బెంగళూరు: ఆదాయ పన్ను విభాగం సోదాల్లో శుక్రవారం సుమారు రూ. 2 కోట్లు పట్టుబడ్డాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. నగరంలోని రాజ్‌మహల్ హోటల్‌పై దాడి చేసి ఒక ప్రభుత్వ ఇంజనీర్ నుంచి రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఎన్నికల ఖర్చుల కోసం నాయకులకు ఇవ్వాలని తెచ్చినట్లు తేలింది. ఇందుకు కాంట్రాక్టర్ల నుంచి 10 శాతం, 20 శాతం మేర కమీషన్ రూపంలో వసూళ్లు చేసినట్లు సమాచారం. ఐటీ దాడులతో పరారు వివరాలు... హావేరిలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసే నారాయణ గౌడ బి.పాటిల్ బెంగళూరుకు వచ్చి ఆనందరావ్ సర్కిల్లో రాజ్‌మహల్ హోటల్లో బస చేశారు. ఐటీ అధికారులు అనుమానంతో ఆయన గదిలో సోదాలు జరపగా, పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడింది. లెక్కించగా రూ.2 కోట్లుగా తేలింది. ఐటీ దాడులు తెలిసి నారాయణగౌడ అదృశ్యమయ్యాడు. ఆయన ఉపయోగిస్తున్న కేఏ25పి2774 కారు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హావేరిలోని నందిలేఔట్లో ఉన్న ఆయన నివాసంలోనూ సోదాలు జరపగా రూ. 25 లక్షలు దొరికాయి. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఐటీ అధికారులు బడా అధికారులు,కాంట్రాక్టర్లు, బ్రోకర్లపై నిఘా పెట్టింది. నారాయణ గౌడ గత కొద్ది రోజులుగా కాంట్రాక్టర్ల నుంచి ఎన్నికల ఖర్చుల పేరుతో కమీషన్లను వసూలు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకుంది. సేకరించిన ఆ డబ్బులను ప్రముఖ నేతలకు ఇచ్చేందుకు హావేరి నుంచి శుక్రవారం బెంగళూరుకు వచ్చి బస చేశారు. హోటల్లో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. ఐటీ అధికారుల బృందం ఆయ న గదుల్లో ఒకదానిన్ని తెరిచి సోదాలు చేపట్టింది. రూ. 2 కోట్ల నగదు, ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో గదిలో నారాయణ గౌడ నిద్రిస్తున్నారు. అధికారుల అలికిడిని గమనించి పారిపోయారు. ఏ రాజకీయ పార్టీకి, నేతకు డబ్బులు ఇవ్వడానికి తెచ్చారనేది తెలియాల్సి ఉంది. -
విజిలే‘సి’ చెప్పొచ్చు!
ఎన్నికల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై అప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు ఎన్నికల ప్రచారాలు, ప్రసంగాలతో పాటు మీడియా, సామాజిక మాధ్యమాలలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే వెంటనే పౌరులెవరైనా ఈ యాప్ ద్వారా దాన్ని ఫొటో లేదా వీడియో సహా ఎన్నికల సంఘానికి నిమిషాల్లో పంపవచ్చు. దానిపై సంబంధిత అధికారులు తక్షణమే దర్యాప్తు జరిపి ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు. ఆపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకుంటుంది. ఎలా పని చేస్తుందంటే..? కెమెరా, జీపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్రమాలకు సంబంధించిన ఫొటో లేదా రెండు నిమిషాలకు మించని వీడియోలను తీసి వాటిని ఈ యాప్‌లో అప్లోడ్ చేసి ఎన్నికల సంఘానికి పంపాలి. ఆ సమాచారం వెంటనే సంబంధిత జిల్లా కంట్రోల్ రూమ్ కు వెళుతుంది. దాని ఆధారంగా తనిఖీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి అక్రమం జరిగిందీ లేనిదీ పరిశీలిస్తారు. ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తారు. ఫిర్యాదుదారుడు తీసిన ఫొటో లేదా వీడియో ఎక్కడిది అన్నది యాప్ లో నిక్షిప్తం చేసిన సాఫ్ట్వేర్ ద్వారా తనిఖీ అధికారులకు తెలుస్తుంది. ఫిర్యాదును అప్లోడ్ చేసిన వెంటనే ఫిర్యాదుదారుడికి ఒక ఐడీ నంబరు వస్తుంది. ఫిర్యాదుపై తదుపరి చర్యల సమాచారం ఎప్పటికప్పుడు అతని మొబైల్‌కు వస్తుంటుంది. ఈ యాప్ ద్వారా ఒకరు ఎన్ని ఫిర్యాదులైనా చేయవచ్చు. అవసరమైతే ఫిర్యా దు దారు తన పేరు తెలియకుండా ఫిర్యాదు చేసే సదుపాయం కూడా దీనిలో ఉంది. ఫిర్యాదుదారుని వివరాలు ఎన్నికల సంఘం రహస్యంగా ఉంచుతుంది. ఇంతకు ముందు ఇలాం టి ఫిర్యాదులపై చర్య తీసుకోవడానికి నెలలు, ఏళ్లు పట్టేది. ఆధారాలు కూడా సరిగా దొరికేవి కాదు. సీ విజిల్ యాప్‌తో పకడ్బందీగా ఫిర్యాదు చేయవచ్చు. కొన్ని గంటలు లేదా రోజుల్లోనే చర్య తీసుకోవడానికి వీలవుతుంది. దుర్వినియోగం కాకుండా.... యాప్‌ను దుర్వినియోగం చేయకుండా ఎన్నికల సంఘం కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల పరిధిలోనే ఈ యాప్ పని చేస్తుంది. సంఘటనను ఫొటో లేదా వీడియో తీసిన ఐదు నిమిషాల్లో దాన్ని అప్లోడ్ చేయాలి. ఈ గడువు దాటితే యాప్ వాటిని స్వీకరించదు. ముందుగా రికార్డు చేసిన వాటిని కూడా స్వీకరించదు. ఈ యాప్ ద్వారా తీసిన ఫొటోలు, వీడియోలను ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయడానికి వీలుండదు. ఎన్నికల నియమావళి ఉలంఘనకు సంబంధించిన ఫిర్యాదులనే ఇది స్వీకరిస్తుంది. -
ప్రచారంపై సాంకేతిక కన్ను
సాక్షి, అమరావతి :ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో అభ్యర్థుల రోజువారి ప్రచారంపై ఎన్నికల సంఘం నిఘా నేత్రంతో పర్యవేక్షించటం కోసం సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులు రోజువారి ప్రచార శైలిలో వారి వెంట ఉంటూ, ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘానికి వివరాలను అందజేయనున్నారు. గతంలో టోల్ ఫ్రీ నెంబర్ 1950, ఈ మెయిల్, ఫ్యాక్స్, తపాలా శాఖ ద్వారా ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు వీటికి అదనంగా సీ విజిల్ యాప్ ద్వారా నేరుగా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దీంతో నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే విధంగా పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించటం సులువుకానుంది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతలతో కలిసి ప్రచారం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించటం, అనుమతి లేనిదే వాహనాల ర్యాలీలు నిర్వహించటం, మారణాయుధాలు కలిగి ఉండడం, ఓటర్లను ప్రలోభ పెట్టే వస్తువులను పంపిణీ చేయటం, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. దీంతో ఇతర పార్టీలలో షాడో టీంలూ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా వారి కోడ్ ఉల్లంఘన విషయాలను ఎన్నికల సంఘంకు చేరవేసే అవకాశం ఉండనుంది. దీంతో అభ్యర్థులు ఎవరిని నమ్మాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అనుమతుల కోసం సువిధ యాప్ ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థులకు ప్రతి నిమిషం విలువైందనే కోణంలో ఎన్నికల సంఘం సువిధ అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం ఈ యాప్ పై స్పష్టత ఇచ్చింది. అభ్యర్థులు ఎన్నికల ప్రచార సభలు, ప్రదర్శనలకు ఆయా శాఖల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున ఎన్నికల హడావుడిలో అధికారులు స్పందించకుంటే వారు వెనకబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ లు సువిధ యాప్ ద్వారా అనుమతులు పొందడానికి అవకాశం కల్పించింది. 48 గంటల ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అధికారులు అనుమతిస్తారు. అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. నిఘా నేత్రం సీ విజిల్ యాప్ ఎక్కడైనా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే సాధారణ ప్రజానీకం సైతం స్పందించి, సీ విజల్ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీనిని గూగూల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటువంటి యాప్‌ల వల్ల... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థుల గుట్టు రట్టు చేసే అవకాశం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది. -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
సాక్షి, కంభం(ప్రకాశం): ఎన్నికల కోడ్ వచ్చి 6 రోజులైనప్పటికీ పలుచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పట్టణంలోని ఏపీ ఆన్లైన్ సెంటర్లో ఇచ్చే రశీదుల్లో ముఖ్యమంత్రి ఫొటో, రశీదు వెనుక వైపున టీడీపీ ప్రభుత్వం పథకాలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలు కూడా ఎక్కడా కన్పించకూడదు. అందులో భాగంగా అధికారులు గ్రామాల్లోని శిలాఫలకాలు, బ్యానర్లు తొలగించుకుంటూ వచ్చారు. కానీ పట్టణ కేంద్రంలో ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది వివిధ రకాల సర్టిఫికెట్లు, పొలాల సమస్యల పరిష్కారాల కోసం, ప్రజలు వస్తుంటారు. వారి దరఖాస్తులు పూర్తిచేసిన అనంతరం రశీదు తీసి ఇచ్చిన దరఖాస్తుకు జతచేసి సంబంధిత కార్యాలయాల్లో అందజేస్తారు. ఆ రశీదుల పైన ముందు భాగం, వెనుక భాగాన ముఖ్యమంత్రి ఫొటోలు, పథకాలు దర్శనమిస్తున్నా సంబంధిత కార్యాలయాల్లోని అధికారులు సైతం పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కోడ్ ఉల్లంఘన జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. కంభంలో.. కంభం : పట్టణంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో గోడల పైన ఉన్న మెనూ చార్ట్‌లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాల బ్యానర్లు, ఫొటోలు తొలగించాలని తెలిసినప్పటికి హాస్టల్ వార్డన్లు కానీ, ఇతర అధికారులు కానీ పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ –1, ఎస్సీ2 హాస్టల్లలో బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. సంబందింత అధికారులు స్పందించి ఎలక్షన్ కోడ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కోడ్ వర్తించేది కొందరికేనా?
ఒంగోలు: టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. పాలక పార్టీ నేతల హోర్డింగులు, ఫ్లెక్సీల తొలగింపునకు ఒంగోలు మున్సిపల్ అధికారులు జంకుతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆర్టీసీ బస్టాండ్‌లో మాత్రం ప్రచార హోరు తగ్గడం లేదు. డిపోలోని భారీ స్క్రీన్‌పై ఇప్పటికీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యాడ్లతో పావుగంటకోసారి ఊదరగొట్టేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, వీటిని నిలుపుదల చేయాలని ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. మరో వైపు బస్టాండులోని డిపో కంట్రోలర్ రూము వద్ద రాయితీలకు సంబంధించి చంద్రబాబు ఫొటోతో కూడిన ప్రచార పోస్టర్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక డిపోలోని స్తంభాలకు సీఎం పేరుతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. డిపో గ్యారేజీ గేటుకు సమీపంలో టీడీపీ అనుబంధ యూనియన్ నాయకులు చంద్రబాబు, మంత్రి ఫొటోలతో వేసిన భారీ ఫ్లెక్సీని ఇంకా తొలగించలేదు. బస్టాండ్‌తోపాటు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులపైన ఎన్టీఆర్ ఫొటోతో ఉన్న వైద్య సేవ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండులో రాజీవ్ మార్గ్ నుంచి బస్టాండ్ జంక్షన్లోకి వెళ్లే మార్గంలో చంద్రబాబు, మంత్రుల ఫోటోలతో ఉన్న భారీ కటౌట్‌ను అధికారులు తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలెక్టర్ బంగళాకు అభిముఖంగా కబాడీపాలెం వైపు వెళ్లేమార్గంలో భారీ హోర్డింగ్ ఒకటి కోడ్ ఉల్లంఘన తీరును తేటతెల్లం చేస్తోంది. ప్రధానంగా హోర్డింగ్‌ల తొలగింపులో నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. -
ఫేస్‘బుక్కవుతారు’..!
సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంతో పాటు రాష్ట్రంలో సోషల్ మీడియా విస్తరించింది. ఓటర్ల కంటే రెట్టింపు స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు సాంకేతిక విప్లవం పెరిగిన నేపథ్యంలో ఈ సారి ఎన్నికల ప్రసారంలో సోషల్‌మీడియా కీలక భూమిక పోషించనుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసే కంటే కొంతమంది సిబ్బందితో సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయగలిగేలా పోస్టింగులు చేసుకుంటే మేలన్న అభిప్రాయాలు లేకపోలేదు. అంతలా సోషల్ మీడియా ప్రభావం దేశంలోను, రాష్ట్రంలోను మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇష్టానుసారం పోస్టింగులు కుదరవిక ఎన్నికల కోడ్ వచ్చేసింది. సామాన్యులతో పాటు ఉద్యోగులు సైతం ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ గ్రూపులలో పోస్టులు పెడుతుంటారు. అయితే సోషల్ మీడియాపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసినా చర్యలు తప్పవు. జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వివిధ పార్టీలకు పరోక్షంగా సహకరించాలని ప్రయత్నించినా..ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులకు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పెట్టినా ఇక అంతే సంగతులు. పోస్టింగులు ఊస్టింగ్ అయిపోతాయి. పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌లోకి అధికారులు, ఉద్యోగులు ఎన్నికల కోడ్ రావడంతో ఎక్కడైనా..ఒకేమాట, ఒకే పాట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎంత మెజారిటీతో గెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇవే అంశాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. పలు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో గ్రూపుల మధ్య వేరు వేరు అభిప్రాయాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వం గురించి పొగడడం గానీ, రాజకీయ పార్టీల గురించి ప్రశంసించడం గానీ అధికారులు చేయకూడదు. ఎన్నికల నియమావళిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం ఎన్నికల కోడ్‌లోకి వచ్చేశారు. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులు వారి అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచే ఎన్నికల కోడ్ రావడంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచారంలో గానీ.. సామాజిక మాద్యమాల్లో సొంత అభిప్రాయాలను పోస్టు చేయడం, వీడియోలు పెట్టడం, షేర్ చెయ్యడం, చర్చలు సాగించడం వంటివి ఎన్నికల నియమావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వెంట ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రచారాలకు వెళ్లడం, వారితోపాటు తిరగడం ఇక వీలుకాదు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్నికల అధికారులు, కలెక్టర్ జె.నివాస్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. -
ఉల్లంఘనులు
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 24 గంటలు పూర్తయ్యింది. అయినా సరే తమకేమీ ఇవి వర్తించవన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ అంతర్గత సమావేశాలు.. సీఎం, మంత్రుల ఫొటోలున్న సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వడం.. టీటీడీలో సిఫార్సు లేఖలకు ఇంకా దర్శనాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమ వారం పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా కోడ్‌ను ఉల్లంఘించారు. చిత్తూరు అర్బన్: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలో ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకునే బాధ్యత రిటర్నింగ్ అధికారుల (ఆర్ఓ)పైనే ఉంది. ప్రభుత్వ శాఖల్లో జరిగే ఉల్లంఘనపై ఆయా శాఖాధిపతికి షోకాజ్ నోటీసు జారీచేసి సంజాయిషీ కోరుతారు. ఇచ్చే సంజాయిషీ సంతృప్తికరంగా లేకపోయినా.. ఉద్యోగుల పాత్ర ఉందని తేలినా వారిని సస్పెండ్ చేస్తారు. ఇక రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల విషయంలో ఉల్లంఘనులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆర్ఓనే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తారు. ఇలా ఉల్లంఘన.. ♦ తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారపార్టీ నా యకుల సిఫార్సు లేఖలకు యంత్రాంగం దర్శనాలుకల్పిస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నా వినేవారులేరు. రాష్ట్ర పార్టీలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి జిల్లా పార్టీ నాయకుల వరకు ఇస్తున్న సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకుంటూ కొందరు అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. ♦ చిత్తూరు నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ చైర్మన్ బాలాజీ డైరెక్టర్లతో అంతర్గత సమావేశం నిర్వహించారు. వైస్ చైర్‌పర్సన్‌ను మార్పుచేయాలంటూ చర్చలు జరిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యాక్రమాలు నిర్వహించకూడదనే నిబంధనలున్నా పట్టించుకునే పరిస్థితిలేదు. ♦ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది కోడ్ ఉల్లంఘన పరిధిలోకి రాకపోయినప్పటికీ సైకిళ్లపై సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఫొటోలతో స్టిక్కర్లు ఉండటం వివాస్పదమయ్యింది. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నేతల ఫొటోలతో ఎంఈవో సైకిళ్లను పంపిణీ చేశారు. ♦ తిరుపతిలోని ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తొలగించలేదు. బస్సులపై ఉన్న స్టిక్కర్లను చూసి సొంతశాఖలోని సిబ్బందే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ♦ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉన్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించలేదు. అలాగే ఎన్టీఆర్ సుజల స్రవంతి కేంద్రాల వద్ద కూడా సీఎం చిత్రాలు దర్శనమిచ్చాయి. ఇక ఫైబర్‌నెట్ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్ర పటాలతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంకా తీయలేదు. ♦ తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్ నిర్మాణానికి గతంలో టీడీపీ నాయకులు యత్నించారు. అయితే క్యాంటీన్ నిర్మాణానికి అనుమతులు రాకపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. ఇంతలోపు ఎన్నికల కోడ్ నగరా మోగింది. అయినప్పటికి టీడీపీ నాయకులు ఎంత మాత్రం తగ్గలేదు. క్యాంటీన్ నిర్మాణానికి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లభించకపోయినా, సాక్షాత్తు కార్యాలయానికి ఎదురుగా పనులను సోమవారం ప్రారంభించారు. ♦ పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో దారి పొడవునా అధికార పార్టీకి చెందిన బ్యానర్లు ఉన్నాయి. దీనిపై అధికారులను సం ప్రదిస్తే ఎన్నికల సంఘం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలూ రాలేదని సమాధామనమిచ్చారు. -
జిల్లాలో మొదలైన ఎన్నికల కోలాహలం
సాక్షి, చిత్తూరు, కలెక్టరేట్: జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. సుమారు 31 లక్షల ఓటర్లు 14 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలను ఎన్నుకునే ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. లోక్‌సభ, శాసన సభలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 25 కాగా, 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇదే నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఏప్రిల్11న పోలింగ్ జరుగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. తక్షణమే నిబంధనలు అమల్లోకి.. తక్షణమే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న బ్యానర్లు కటౌట్లు, ఫ్లెక్సీలు 24 గంటల్లో తొలగించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో 48 గంటల్లోగా తీసేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికార వాహనాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పథకాలపై ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయకుంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్, మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలివేటు.. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు వేసేందుకు కలెక్టర్ ప్రద్యుమ్న వెనకాడడం లేదు. ఇందులో భాగంగా కుప్పం ఈడీటీ జీహెచ్ ఆనంద్ బాబును సస్పెండ్ చేశారు. అధికారులు ఉద్యోగులు మోడల్ కోడ్‌ను అనుసరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటానని ముందే హెచ్చరించారు. కఠినంగా వ్యవహరిస్తాం ఎన్నికల నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. 22వేల మంది సిబ్బందితో ఎన్నికలకు రెడీ అయ్యాం. ఇంకా 200 ఈవీఎంలు రావాల్సి ఉంది. రాత్రి పది గంటల తరువాత ప్రచారం నిషిద్ధం. ఉదయం 6 గంటల తరువాతే ప్రచారానికి అనుమతి. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రచారం చేసుకోకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలన్నదే నా ధ్యేయం. –జిల్లా ఎన్నికల ప్రధానాధికారి పీఎస్ ప్రద్యుమ్న 38 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం జిల్లాలో 38 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోనే 23 నెలకొల్పాం. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వ్యక్తిగతంగా ఉంచుకోరాదు. అంతకంటే ఎక్కువ నగదు దొరికితే కేసు నమోదు చేస్తాం. సరైన డాక్యుమెంట్లు చూపే వరకు నగదు వెనక్కి ఇవ్వం. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ -
అన్నన్నా.. కోడ్ ఉందన్నా..
సాక్షి, తెనాలిరూరల్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, అధికారులకు పట్టడంలేదు. అధికార పార్టీకి అనుచరులుగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట, మార్కెట్ కాంప్లెక్స్ ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేయకుండా వదిలేశారు. ఇక దాని వెంబడి ఉన్న అన్న క్యాంటీన్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్ల గాడలపై ఎన్టీఆర్, చంద్రబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిత్రపటాలను కూడా అలాగే వదిలేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుటనే ఇలా కోడ్ ఉల్లంఘన జరుతుండడంపై ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన ?
విశాఖపట్నం, చోడవరం: ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు పలువురికి ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయమై కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పట్టాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించరాదు. అయితే ఆ నింబధనను చోడవరం టీడీపీ ఎమ్మెల్యే తుంగలోకి తొక్కి వెంకన్నపాలెం, లక్ష్మీపురం రోడ్డు ప్రాంతాల్లో ప్రభుత్వ బంజరు భూమికి సంబంధించిన పట్టాలు పంపిణీ చేశారు. సుమారు 170 మంది లబ్ధిదారులకు అతని కార్యాలయంలో పట్టాలు పంపిణీచేసినట్టు తెలిసింది. ముందస్తు తేదీతో పట్టాలను సిద్ధం చేయగా, చోడవరం తహసీల్దార్ సోమవారం ఉదయమే సంతకాలు చేసినట్టు సమాచారం. వెంకన్నపాలెంలో సర్వే నంబరు 420, చోడవరం శివారు లక్ష్మీపురంరోడ్డులో సర్వే నంబరు 18లో సబ్‌డివిజన్ 30లో పలువురు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు పంపిణీ చేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పట్టాలు పంపిణీకి చోడవరంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ముందుగా అందర్నీ రప్పించినప్పటికీ తర్వాత ఎన్నికల కోడ్ ఉన్నందున బహిరంగంగా ఇస్తే ఇబ్బందులు వస్తాయని కొందరు అధికారులు సూచించడంతో బహిరంగం పంపిణీని మానేశారు. తరువాతగుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారులందర్నీ ఒక్కొరిగా పిలిచి పట్టాలు పంపిణీ చేశారని తెలిసింది. ఇదంతా తహసీల్దార్ పర్యవేక్షణలోనే జరిగినట్టు తెలిసింది. చోడవరం పంచాయతీ కార్యాలయాన్ని పట్టాల తయారీ కేంద్రంగా మారుచుకున్న ఎమ్మెల్యే ఇక్కడ నుంచే అన్నీ సిద్ధం చేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేయగా దానికి రెవెన్యూ అధికారులు వెనకుండి నడిపించారని విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్‌కు ౖఫిర్యాదు చేస్తాం: ధర్మశ్రీ సోమవారం ఉదయం నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ చోడవరం తహసీల్దార్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి రెవెన్యూ భూమికి పట్టాలు పంపిణీచేశారని, దీనిపై కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నామని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన అధికారులు ఇలా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ఏంటని ఆయన మండిపడ్డారు. తహసీల్దార్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ధర్మశ్రీ కోరారు. వెంకన్నపాలెంలో అయితే భూమిని లెవిలింగ్ చేయకుండా, ఇళ్లస్థలాలకు విభజించకుండా హడావిడిగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పట్టాలు ఇచ్చారని ఇందులో చాలామంది టీడీపీకి చెందిన అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.