
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నా యి. ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, ప్రైవే టు ఆస్తులను తమ ప్రచార అవసరాల కోసం దుర్వి నియోగం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ గోడలపై రాతలు, బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో కోడ్ ఉల్లంఘనలపై అధికారులు సైతం కొరడా ఝళిపిస్తున్నారు.
మంగళవారం ఒక్కసారిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు రెట్టింపయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పబ్లిక్ ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి రాష్ట్రంలో సోమవారం వరకు 72,581 కోడ్ ఉల్లంఘనలు నమో దు కాగా, మంగళవారం ఒకే రోజు 53,104 ఉల్లంఘనలు గుర్తించారు. దీంతో ఈ విభాగంలో ఉల్లంఘనల సంఖ్య 1,25,785కు చేరింది. 6,815 గోడలపై రాతలు, 57,455 పోస్టర్లు, 30,848 బ్యానర్లు, 30,667 ఇతర ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి.
వీటిలో 79,703 బ్యానర్లు, పోస్టర్లు, గోడలపై రాతలను తొలగించగా, 55 కేసులను నమోదు చేశారు. ప్రైవేటు ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి సోమవారం నాటికి 21,693 ఉల్లంఘనలు రికార్డవ్వ గా, మంగళవారం 33,347 ఉల్లంఘనలను గుర్తిం చారు. వీటిలో 6,946 గోడలపై రాతలు, 21,045 పోస్టర్లు, 12,959 బ్యానర్లు, 14,090 ఇతర ఉల్లంఘనలుండగా, ఇప్పటివరకు 45,980 ఉల్లంఘనలకు సంబంధించిన వాటిని తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment