ఈనెల 12వ తేదీన ఏపీ ఆన్‌లైన్ సెంటర్‌లో ప్రింట్ తీసి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన రశీదు
సాక్షి, కంభం(ప్రకాశం): ఎన్నికల కోడ్ వచ్చి 6 రోజులైనప్పటికీ పలుచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పట్టణంలోని ఏపీ ఆన్‌లైన్ సెంటర్‌లో ఇచ్చే రశీదుల్లో ముఖ్యమంత్రి ఫొటో, రశీదు వెనుక వైపున టీడీపీ ప్రభుత్వం పథకాలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలు కూడా ఎక్కడా కన్పించకూడదు. అందులో భాగంగా అధికారులు గ్రామాల్లోని శిలాఫలకాలు, బ్యానర్లు తొలగించుకుంటూ వచ్చారు. కానీ పట్టణ కేంద్రంలో ఉన్న ఏపీ ఆన్‌లైన్ సెంటర్‌లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది వివిధ రకాల సర్టిఫికెట్లు, పొలాల సమస్యల పరిష్కారాల కోసం, ప్రజలు వస్తుంటారు. వారి దరఖాస్తులు పూర్తిచేసిన అనంతరం రశీదు తీసి ఇచ్చిన దరఖాస్తుకు జతచేసి సంబంధిత కార్యాలయాల్లో అందజేస్తారు. ఆ రశీదుల పైన ముందు భాగం, వెనుక భాగాన ముఖ్యమంత్రి ఫొటోలు, పథకాలు దర్శనమిస్తున్నా సంబంధిత కార్యాలయాల్లోని అధికారులు సైతం పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కోడ్ ఉల్లంఘన జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
కంభంలో..
కంభం : పట్టణంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో గోడల పైన ఉన్న మెనూ చార్ట్‌లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాల బ్యానర్లు, ఫొటోలు తొలగించాలని తెలిసినప్పటికి హాస్టల్ వార్డన్లు కానీ, ఇతర అధికారులు కానీ పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ –1, ఎస్సీ2 హాస్టల్‌లలో బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. సంబందింత అధికారులు స్పందించి ఎలక్షన్ కోడ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment