సాక్షి, యర్రగొండపాలెం: బాబు, కాంగ్రెస్, జేడీ లక్ష్మీనారాయణల కుట్ర బహిర్గతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వారందరు కలిసి కుట్రపన్ని అక్రమంగా కేసును బనాయించి జైల్లో ఉంచారు. ఆ కుట్రకు నిదర్శనం జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్ పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసం చేయడం, కుట్రలు పన్నడం, వెన్నుపోటు పొడవడం జగన్‌కు సాధ్యం కాదని, అవన్ని బాబుకు వెన్నతోపెట్టిన విద్యఅని ఆయన విమర్శించారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి డబ్బుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే పి.డేవిడ్‌రాజు మూడేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారని, అభివృద్ధి జరిగితే తమ సొంతానికి మాత్రమే జరిగిందన్నారు. ముందుగా సురేష్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్‌చేసి పంచారు. ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పార్టీ సీనియర్ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు డి.కిరణ్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు జబీవుల్లా, బీసీ, యువజన విభాగాల రాష్ట్ర కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, నవోదయ పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కె.గురుప్రసాద్, వివిధ విభాగాల నాయకులు ఎన్.వెంకటరెడ్డి, బి.బాలచెన్నయ్య, ఎం.రాజశేఖరరావు, జి.వెంకటరెడ్డి, ఒ.సుబ్బారెడ్డి, కె.కాశీవిశ్వనాథ్, కె.వెంకటయ్య, మహిళా విభాగం నాయకురాళ్లు ధనలక్ష్మిబాయి, అరుణాబాయి, సావిత్రిలు పాల్గొన్నారు.
బాబు కుట్ర బహిర్గతం
Published Wed, Mar 13 2019 11:09 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment