ఆలయంలో సమావేశం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
ఇచ్ఛాపురం రూరల్: ఓ వైపు ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్న టీడీపీ నేతలు మరోవైపు పల్లెల్లో స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండల టీడీపీ నేతలైతే ఏకంగా అమ్మవారి ఆలయాన్నే తమ సమావేశానికి వేదికగా ఉపయోగించుకున్నారు. గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో ఎన్నికల సమావేశాలు నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది.
ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఇచ్ఛాపురంలోని ‘స్వేచ్ఛావతి అమ్మవారు ఆలయం’లో శనివారం టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించి కోడ్‌ను ఉల్లంఘించారు. సమావేశానికి అనుమతిచ్చిన కమిటీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో.. చంద్రబాబు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇచ్ఛాపురం మండలంలో 13 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసి ప్రచారం చేయాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment