సాక్షి, తాడేపల్లి: ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు మరో ప్లాన్ రచించుకున్నారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చాడు చంద్రబాబు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ కలరింగ్ ఇచ్చిన బాబు.. ఇప్పుడు మాట మార్చాడని వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు చేసింది.
కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టర్ వేదికగా.. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేసిన చంద్రబాబు. ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలి. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు వీడియోను షేర్ చేసింది.
అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా మార్చేసిన @ncbn
ప్రజలు డబ్బులు ఇవ్వాలి.. కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలి
అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ ఇన్నాళ్లు డబ్బాకొట్టారు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం
కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ.. https://t.co/f3BLYS0Xpz— YSR Congress Party (@YSRCParty) August 15, 2024
ఇక, అన్న క్యాంటీన్లపై వైఎస్సార్‌సీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు. అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందన్నారు. క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ.. ఊరికి దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. క్యాంటీన్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment