సీఆర్‌డీఏ అధికారులతో శ్రీరామ్ అక్షయపాత్ర సంస్థ ప్రతినిధుల భేటీ
తుళ్ళూరు : ఈనెల 25న తుళ్ళూరు మండలంలోని పలు ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు శ్రీరామ్ అక్షయపాత్ర సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మంగళవారం తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో జేసీ శ్రీధర్‌తో, పలువురు సీఆర్‌డీఏ అధికారులతో సమావేశమయ్యారు.
ఈనెల 25న సీఎం చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీరామ్ అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు తెలిపారు. తుళ్ళూరు మండల అధికారుల సూచనల మేరకు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.