జగన్‌ను ఇంటికి పంపేందుకు ఎన్నారైలు ఏడాది పని చేశారు
పెద్దిరెడ్డి అక్రమాలపై వేలాది బాధితులు ఫిర్యాదు చేశారు
22ఏని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున దందాలు చేశారు
వైఎస్సార్‌సీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు
జిల్లా యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ!
సాక్షి, అమరావతి: దాతలు, ప్రజల విరాళాలతో జన్మభూమి–2 ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో చేసిన ఐదు సంతకాల అమలును ప్రారంభించామని చెప్పారు. పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధిలో పార్టీ అండగా ఉంటుందన్నారు. సిఫార్సులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించి దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌రెడ్డిని ఇంటికి పంపించడానికి ఉపాధి కోల్పోయి వలస వెళ్లిన కారి్మకులు కూడా వచ్చి ఎన్నికల్లో ఓటేశారని, ఎన్నారైలు విదేశాల నుంచి వచ్చి ఏడాది పాటు పని చేశారని చంద్రబాబు అన్నారు.
వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయతి్నంచిన విధంగానే మదనపల్లెలో భూ కుంభకోణాల సాక్ష్యాలను తారుమారుకు కూడా కుట్ర చేశారన్నారు. వివేకాది గుండెపోటని చెప్పినట్లుగానే.. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధాన్ని షార్ట్ సర్క్యూట్‌గా ప్రచారం చేశారన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలపై ఒక్క రోజులోనే వేలాది బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అంటేనే నేరస్థులు, అరాచకవాదులని అన్నారు. 13 లక్షలకు పైగా అసైన్డ్ భూములను కాజేశారని, 40 వేల ఎకరాలు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. 22ఏను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, దందాలు చేశారని అన్నారు.
అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు
అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, 8 వెనకబడ్డ జిల్లాలకు కేంద్ర సహకారం, నరేగా, నీరు–చెట్టు బిల్లుల విడుదల, ప్రజావేదిక, ప్రజాదర్బార్‌లో వచి్చన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్టు వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, దోపిడీపై విడుదల చేసిన ఏడు శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని భావిస్తున్నట్టు చంద్రబాబు పొలిట్‌బ్యూరోలో వివరించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment