అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు | No going back on crop loan waiver, says paritala sunitha | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు

Published Wed, Sep 10 2014 10:38 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు - Sakshi

అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు

గుంటూరు : రైతు రుణమాఫీ చేసి తీరుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జిల్లాల్లో ఎంపిక చేసిన నగరాల్లో అన్న క్యాంటిన్లు ప్రారంభం కానున్నట్లు పరిటాల సునీత వెల్లడించారు.

మంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం నాలుగు గంటలకు రేపల్లె నియోజకవర్గం బేతపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement