
పవన్ కల్యాణ్, పరిటాల సునీత(పాత చిత్రం)
గుంటూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి సునీత ఆహ్వానం పలికారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్‌ది యువరక్తమని, యాత్రల పేరుతో సమయం వృథా చేసుకోవడం అనవసరమని హితవు పలికారు. తమతో కలిసి ముందు నడిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు.