దారితప్పిన మంత్రి పరిటాల సునీత | paritala sunitha searching for tdp office in guntur while one hour | Sakshi
Sakshi News home page

పార్టీ కార్యాలయం దొరక్క మంత్రి హైరానా

Published Tue, Nov 28 2017 8:02 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

paritala sunitha searching for tdp office in guntur while one hour - Sakshi

సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి వెళుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి పరిటాల సునీత దారి తప్పారు. మంగళవారం ఆమె... గుంటూరులో టీడీపీ కార్యాలయం అడ్రస్‌ కనుక్కోలేకపోయారు. పార్టీ కార్యాలయం ఎక్కడుందో తెలియక నగరంలోని అన్ని వీధులు తిరిగారు. గంటసేపు పార్టీ కార్యాలయం కోసం వెతుకులాటలోనే సరిపోయింది. ఎంతసేపటికీ పార్టీ కార్యాలయం అడ్రస్‌ కనుక్కోలేక ఆమె కొద్దిగా హైరానా పడ్డారు. మరోవైపు స్థానిక పోలీసులు మంత్రికి సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారంటూ జిల్లా టీడీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement