famers
-
విత్తనంనుంచి అమ్మకందాకా అన్నదాతలకు అండ
-
రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి!
సాక్షి, హైదరాబాద్ : రబీ సీజన్లోనూ రైతులందరికీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు భావిస్తోంది. ఖరీఫ్‌లో రైతు బంధు పథకం కింద ఎంతమందికి పెట్టుబడి సొమ్ము ఇస్తారో వారందరికీ రబీలోనూ అందజేయాలని యోచిస్తోంది. ఈ లెక్కన రబీలో రైతులు సాగు చేసినా, చేయకపోయినా ఆర్థిక సాయం అందనుంది. ఖరీఫ్‌లో పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సొమ్మును అందజేయనున్నారు. అయితే రబీలో మాత్రం కేవలం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం గతంలో నిర్ణయించింది. పంటలు సాగు చేసిన రైతుల లెక్కలు తేల్చి.. వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని భావించారు. అయితే తాజాగా ఆ నిర్ణయానికి సవరణ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెండ్రోజుల క్రితం మాట్లాడుతూ.. ‘రబీలోనూ రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం’అని చెప్పారు. వాస్తవానికి ఖరీఫ్ కంటే రబీలో పంటల సాగు మూడో వంతుకే పరిమితం అవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. రబీ విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రబీ నాటికి నీరందితే 8 లక్షల ఎకరాలు అదనంగా సాగు కానుందని అంటున్నారు. రూ.12 వేల కోట్ల బడ్జెట్ ఉందిగా.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఖరీఫ్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించి, రబీలో కొందరికే ఇస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పైగా రబీలో ఎవరు సాగు చేశారు, ఎవరు చేయలేదన్నది తేల్చడం కష్టమైన వ్యవహారం. ఖరీఫ్‌లో విజయవంతంగా అమలు చేసి, రబీలో వివాదంగా మారితే అది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన సర్కారులో ఉంది. ఎలాగూ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించినందున రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తే వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చన్నది ప్రభుత్వ భావనగా చెబుతున్నారు. రబీలోనూ అందరికీ పెట్టుబడి సొమ్ము ఇచ్చే అంశంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. -
రుణ ఉప‘శయన’ పత్రాలు!
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల రుణమాఫీ..అస్తవ్యస్తంగా మారింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ ప్రచారానికి తోడ్పడుతున్నా.. అన్నదాతలకు ఎలాంటి చేయూతా ఇవ్వడం లేదు. టీడీపీ ఆధినేత నారా చంద్రబాబు నాయుడు..2014 అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని తుస్సుమనిపించారు. పట్టుమని పది శాతం మందికి కూడా సంతృప్తికరంగా రుణమాఫీ కాలేదని చెప్పవచ్చు. జిల్లాలో రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు 5.25 లక్షల మంది ఉన్నారు. అయితే అనేక సార్లు వడపోసి 4,30,824 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. మొదటి విడతలో 4,30,824 మంది రైతులకు రూ.687 కోట్లు, రెండో విడతలో 2,70,110 మంది రైతులకు రూ.251 కోట్లు, మూడో విడతలో 1,30,523 మందికి రూ. 303.9 కోట్లు మాఫీ అవుతోంది. రూ.50వేలు,ఆ లోపు రుణం అయితే ఒకేసారి మాఫీ కావాల్సి ఉంది. ఆపైన అప్పు ఉంటే నాలుగేళ్లలో మాఫీ అవుతుంది. చాలా మందికి మొదటి విడతలో రూ.50వేల లోపు రుణం మాఫీ కాలేదు. అర్హత పత్రాలు ఏవీ? మొదటి విడతలో పూర్తిగా రుణమాఫీ లభించని రైతులకు రెండో విడతలో రైతుసాధికర సంస్థ నుంచి రుణ ఉపశమన అర్హత పత్రాలు రావాల్సి ఉంది. జిల్లాలో 20 వేల మందికి ఈ పత్రాలు రాలేదు. మూడో విడతలో వస్తాయని ఆశతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూపాడుబంగ్లా మండలం తంగడంచెలో జరిగిన కార్యక్రమంలో మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇప్పటికి 20 రోజులు అయినప్పటికీ జిల్లాలో ఒక్క రైతుకు కూడా మూడో విడత రుణమాఫీ నిధులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు. మూడో విడత రుణమాఫీ పొందాలంటే రైతులు రెండో విడతలో ఇచ్చిన రుణ ఉపశమన అర్హత పత్రంతోపాటు ఆధార్ కార్డు నకళ్లను సంబంధిత బ్యాంకుల్లో ఇవ్వాల్సి ఉంది. ఈ వివరాలను బ్యాంకర్లు రైతుసాధికార సంస్థకు అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి రుణమాఫీ నిధులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. రైతులు 15 రోజులుగా బ్యాంకుల్లో రుణ ఉపశమన అర్హత పత్రం, ఆధార్ కార్డు నకళ్లు ఇస్తున్నా బ్యాంకర్లు వాటిని రైతు సాధికారసంస్థకు అప్లోడ్ చేయకుండా పక్కన పెట్టినట్లు సమాచారం. నేటి నుంచి ఫిర్యాదుల స్వీకరణ రైతుల రుణమాఫీకి సంబంధించిన ఫిర్యాదులను సోమవారం నుంచి ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో స్వీకరించనున్నారు. కలెక్టరేట్లోని జేడీఏ కార్యాలయం, కర్నూలు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరుల్లోని ఏడీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. -
రుణమాఫీ కోసం రైతుల పాట్లు
-
గ్రామాల్లోని ప్రతి చెరువునూ బాగు చేస్తాం
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వలపర్ల(మార్టూరు): ప్రతి గ్రామంలో ఉన్న చెరువులను బాగు చేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో గురువారం జరిగిన ‘నీరు- చెట్టు’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. గతంలో రైతులు తన పొలాల్లో గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షం కురిసినప్పుడు, కాల్వలకు నీరు విడుదలైనపప్పుడు నిల్వ చేసుకొని అన్ని అవసరాలకూ ఉపయోగించుకునే వారన్నారు. అనంతరం శిధ్ధారాఘవరావు మాట్లాడుతూ చెట్లు పెంచటం, నీటిని నిల్వ చేసుకోవటం ద్వారా భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులుండవన్నారు. పర్యావరణాన్ని కాపాడవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మొక్కలను పెంచటం అనేది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు: ప్రత్తిపాటికి రైతుల మొర రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన రైతులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి మొరపెట్టుకున్నారు. బ్యాంకర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం డ్వాక్రా మహిళలకు రూ.56 లక్షల రుణాలను, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్‌ను అందించారు. మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇన్చార్జి కలెక్టర్ ఎం.హరిజవహరలాల్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాశ్‌కుమార్, డ్వామా పథక సంచాలకుడు ఎన్.పోలప్ప, జలవనరుల శాఖ సూపరెంటెండెంట్ శారద, డివిజినల్ ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ మురళీ కృష్ణ, ఏపీఎంఐపీ పథక సంచాలకుడు బాపిరెడ్డి, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు సి.రాజేంద్రకృష్ణ, ఆర్డీవో కె, శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి బూరగ వీరయ్య, ఎంపీపీ తాళ్లూరి మరియమ్మ, తహశీల్దార్ సుధాకర్ మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రావివలసలో రైతుల ఆందోళన
-
అక్టోబర్ 2నుంచి అన్న క్యాంటిన్లు
గుంటూరు : రైతు రుణమాఫీ చేసి తీరుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బోగస్ రేషన్ కార్డుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి జిల్లాల్లో ఎంపిక చేసిన నగరాల్లో అన్న క్యాంటిన్లు ప్రారంభం కానున్నట్లు పరిటాల సునీత వెల్లడించారు. మంత్రి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో లెవీ విషయమై సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే జిల్లా యంత్రాంగంతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం నాలుగు గంటలకు రేపల్లె నియోజకవర్గం బేతపూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు -
చంద్రబాబు దా'రుణ' మాఫీ!
* ఏపీలో 43.93 లక్షల రైతు ఖాతాలు * పంట రుణాల మొత్తం విలుల 28 వేల కోట్లు * రుణ మాఫీ ఇప్పట్లో లేదంటున్న కోటయ్య కమిటీ * మాఫీపై పూటకొక్క మాట ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రుణమాఫీ జపం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేక మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. రుణమాఫీపై చంద్రబాబు సర్కారు మాయమాటలు చెప్పడం ఆంధ్రప్రదేశ్ రైతులకు భారంగా మారుతోంది. రుణమాఫీ ఎంతవరకు చేస్తారో ముందు తెలియకపోవడంతో రైతులు సకాలంలో చెల్లించలేదు. మహిళా సంఘాల రుణాలతో కలిపి ఒక కుటుంబానికి లక్షన్నర రూపాయల వరకే అని ప్రభుత్వం చెప్పడంతో అంతకు మించి రుణం కలిగి, ఓవర్ డ్యూస్ అయిన రుణాలకు వడ్డీ భారం పడనుంది. ఈ విధంగా ఓవర్ డ్యూస్ అయిన రైతులకు సంబంధించినవి ఏపీలో 43.93 లక్షల ఖాతాలుండగా వాటిపై 28 వేల కోట్ల మేర రుణాలున్నాయి. లక్షన్నర రూపాయల వరకే రుణ మాఫీ అని ప్రభుత్వం ముందుగా చెప్పి ఉంటే అంతకు మించి రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించి రాయితీ పొందేవారు. బాబు ఓవర్ యాక్షన్ తో ఓవర్ డ్యూస్ భారం - ఇప్పుడు ఓవర్ డ్యూస్ కావడంతో ఆ రుణాలకు వడ్డీ రాయితీ వర్తించబోదని అధికారులు అంటున్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు కేంద్రం ఇచ్చే 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ ఓవర్ డ్యూస్ అయిన ఖాతాలకు వర్తించబోదని బ్యాంకులు అంటున్నాయి. ఓవర్ డ్యూస్ అయిన ఖాతాల వారు 12 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇటు కోటయ్య కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న రుణ మాఫీ ఇప్పట్లో అమలు కాదని తేల్చి చెప్పింది. భగ్గుమంటున్న రైతులు - చంద్రబాబు ప్రకటనలు రైతులను నిలువునా ముంచేశాయన్నది సుస్సష్టం. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతు రుణాలు మొత్తం మాఫీ చేయాల్సిందేనంటున్నారు రైతులు. రుణాల రద్దుపై మొదటి సంతకం చేస్తానని చెప్పి..కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సంతకం చేశారని వారు మండి పడుతున్నారు. కుటుంబానికి లక్షన్నర మాత్రమే రుణమాఫీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా స్పందించింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతాంగం నోట్లో టీడీపీ సర్కార్ మట్టిగొట్టిందని ఆ పార్టీ నేతలంటున్నారు. -
అమ్మో.. లెహర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావం నుంచి ‘పశ్చిమ’ ఇంకా తేరుకోలేదు. ఈలోగానే ముంచుకొస్తున్న లెహర్ తుపాను ప్రజలను హడలెత్తిస్తోంది. పెనుగాలులతో బెంబేలెత్తించిన హెలెన్ కంటే లెహర్ తుపాను ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అంతటా భయూందోళనలు నెలకొన్నారుు. హెలెన్ తుపాను ప్రభావానికి తీర ప్రాంతంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోగాలులు వీయడంతో సముద్రంతో సహవాసం చేసే గంగపుత్రులు సైతం వణికిపోయారు. ఇప్పుడు లెహర్ తుపాను ప్రభావంతో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయనే సమాచారం బెంబేలెత్తిస్తోంది. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వరి దుబ్బులు నేలకొరిగి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇక 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే మిగిలిన కాస్త పంటలు కూడా కొట్టుకుపోతారుు. గత నెలలో పై-లీన్ తుపా ను, అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డెల్టాలోని 1.36 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా హెలెన్ తుపాను 2,74,082 ఎకరాల్లో పంటలను మింగేసింది. జిల్లాలో మొత్తం ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా, ఇప్పటికే వచ్చిన రెండు తుపాన్లు, అల్పపీడనం వల్ల నాలుగు లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. మిగిలిన రెండు లక్షల ఎకరాల పంటను లెహర్ మింగేస్తుందేమోనని రైతులు వణికిపోతున్నారు. హెలెన్ ధాటికి మునిగిన పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. పంటను బయటకు తెచ్చే పనిలో ఉండగానే, మరో తుపాను ముంచుకురావడం రైతుల్ని కుదేలు చేస్తోంది. వణుకుతున్న తీరం గతంలో ఎన్నో తుపానులను చూసి.. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా నిబ్బరంగా తట్టుకోగలిగిన తీరప్రాంత వాసులు ప్రస్తుత వరుస తుపానుల దెబ్బకు వణికిపోతున్నారు. హెలెన్ ధాటికి నరసాపురం నియోజకవర్గంలో రెండురోజులపాటు కరెంటు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. పెనుగాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలింది. పునరుద్ధరణ పనులు చేస్తుండగానే, మరో తుపాను మరింత భీకర రూపంలో ముంచుకొస్తోందనే వార్త తీర ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తోంది. మరోవైపు సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారులు ఏం జరుగుతుం దోనని ఆందోళనలో మునిగిపోయారు. మొన్నటి తుపాను ధాటికి నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాలు అర కిలోమీటరు మేర కోత కు గురయ్యాయి. లెహర్ దెబ్బకు ఊరు కొట్టుకుపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. మిగిలిన 35 తీర ప్రాంతాల మత్స్యకారులు ఇప్పటికే బోట్లు, వలలు దెబ్బతిని నష్టాల పాలయ్యారు. కొద్దిరోజుల నుంచి వారి ఉపాధికి గండిపడింది. మళ్లీ పెను తుపాను వస్తుండడంతో ఇక తమకేమీ మిగలదని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. యంత్రాంగం బెంబేలు జిల్లాలో నెలకొన్న విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికార యంత్రాం గం హైరానా పడుతోంది. అల్పపీడనం, పై-లీన్ తుపానుల వల్ల జరిగిన నష్టం అంచనాలను ఇంకా రూపొందించలేదు. హెలెన్ తుపాను సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగానే, లెహర్ విరుచుకుపతుందనే సమాచారం యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. లెహర్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలతో మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ ఎవరికీ కంటిమీద కునుకు లేకుండాపోయింది. వరుస విపత్తులతో ఏంచేయాలో తెలియని అయోమయం వారిని వెంటాడుతోంది. అక్టోబర్, నవంబర్ నెలలు జిల్లాకు అగ్నిపరీక్షగా మారాయి.