రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు
మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా 13 నగరాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ క్యాంటీన్ల ఏర్పాటుపై చర్చించేందుకు వెలగపూడి సచివాలయంలో శుక్రవారం మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, సీఆర్‌డీఏ, పౌరసరఫరాల శాఖ అధికారులు, అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు సమావేశమై దీనిపై చర్చించారు. 100 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.