Cabinet Sub-Committee
-
ఫీజుల దరువుకు బ్రేకులెలా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిన నేపథ్యంలో, పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతోంది. ఫీజుల నియంత్రణకు 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. సర్కారీ స్కూళ్లలో మౌలికవసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు ప్రతి ఏటా ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది. మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు! ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 35 లక్షల మందికిపైగా చదివే 11 వేల ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ఉంది. అవసరం లేని ఖర్చును అభివృద్ధిలా..! ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా చేయాలని పాఠశాల విద్య అధికారులకు ఉప సంఘం సూచించింది. స్కూల్ డెవలప్మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జీవోలిచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును చేస్తూ ఆ పనులను అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక స్కూలు ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కల్లో చూపింది. ఫీజులు 25 శాతం పెంచేసింది. ఇలా స్కూళ్లు ఫీజులు అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. వీటిని క్రమబధ్ధికరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖర్చు 10 శాతం దాటితే పక్కా లెక్క ఉండాలి స్కూళ్ల మూడేళ్ల ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించవచ్చని తిరుపతిరావు కమిటీ సూచించింది. ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటి ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులకు బ్యాంకు ద్వారానే చెల్లింపులు ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఈ దిశగానూ కొన్ని సిఫారసులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారు. -
AP: ఆందోళన విరమణ
ఒప్పంద వివరాలివీ.. ► ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల.. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు ► 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్ఆర్ఏ ► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్ఆర్ఏ ► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్ఆర్ఏ ► 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తింపు.. ఈ జనవరి నుంచి అమలు ► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్ఆర్ఏ ► సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్ వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ► రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం ► 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు.. మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ ► వేతన సవరణ పరిమితి ఐదేళ్లే.. అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు ► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు ► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల ► సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు.. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► 2022 జూన్ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు. సాక్షి, అమరావతి: మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటిస్తూ.. చొక్కాలకు పెట్టుకున్న నల్ల బ్యాడ్జీలను తొలగించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల కోరికలపై సీఎం వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా మంత్రివర్గ ఉప సంఘం రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుది విడత చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్లో వివరించగా ఆయన ఆమోదించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి సంయుక్తంగా వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చర్చోప చర్చలు.. తొలుత ఉదయం మంత్రుల కమిటీలో ఉన్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి శుక్రవారం జరిగిన చర్చల వివరాలను తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని ఉద్యోగులు కోరిన మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆర్థిక శాఖాధికారులతో చర్చించారు. అనంతరం 4 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిపారు. ఏకాభిప్రాయంతో సానుకూలంగా ఉద్యోగ సంఘాలను ఒప్పించడంతో వారు సమ్మె విరమించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డిలతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల ఆవేదన గుర్తించాం.. పీఆర్సీ తదనంతర పరిణామాలపై నిన్న (శుక్రవారం), ఈరోజు (శనివారం) సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అందుకే అడక్కుండానే సీఎం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం మొదటి నుంచి చెబుతున్నారు. ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చారు. పీఆర్సీ కూడా వారికి బాగా ఇవ్వాలని భావించారు. కానీ కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతింది. అందుకే అనుకున్న మేరకు, ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారు. వారికి ఇంకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఎంత వరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించింది. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయి. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు నిజంగా ఇది గుడ్ డీల్ ఈ రోజు ఉద్యోగులకు గొప్ప శుభదినం. వ్యవస్థలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలుంటాయి. వాటిని నేర్పుతో, ఓర్పుతో సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగుండి ఉండే మంచి బెనిఫిట్స్ వచ్చి ఉండేవని ఆశించేవాళ్లం. కానీ ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చారు. కొన్ని అంశాలలో అన్యాయం జరగడంతో రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈరోజు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోగలిగాం. పీఆర్సీ కోసం ఏర్పాటైన అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేము లేవనెత్తిన డిమాండ్లలో ప్రధానమైన ఐఆర్ రికవరీ నిలిపి వేయడం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లు సరిచేయడం, పెన్షనర్స్‌కు అదనపుæ క్వాంటంను పునరుద్దరించడం, ఐదేళ్ల కోసారి పీఆర్సీ ఏర్పాటు చేసే అంశాన్ని కొనసాగిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఆర్టీసీలో పీఆర్సీ అమలుకు ప్రత్యేక ఉత్తర్వులిస్తామన్నారు. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకోవడంతో మార్చి 31వ తేదీలోగా రోడ్‌మ్యాప్ డిక్లేర్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1993 నవంబర్ 25కు ముందున్న ఎన్ఎంఆర్ కంటిజెంట్ ఎంప్లాయిస్ను కూడా ఆ పరిధిలోకి తీసుకురావాలన్న హామీని కూడా అంగీకరించారు. విలేజ్, వార్డు సచివాలయ సిబ్బందికి జూన్ 30లోగా ప్రొబెషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ స్టీమ్‌లైన్ చేసే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు. పీఆర్సీ రిలేటెడ్ అంశాలు 9, ఇతర సమస్యలు 4 అంశాలు తాము లేవనెత్తగా, తాము డిమాండ్ చేయని మరో నాలుగు అంశాలు కలిపి..17 అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. నాలుగు జేఏసీల తరఫున పీఆర్సీ సాధన సమితి ఏకగ్రీవంగా ఈ డిమాండ్లను ఆమోదిస్తూ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. మంత్రులు, సీఎస్, ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా మాట్లాడి ఉంటే మన్నించగలరు. – సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సీఎం చొరవతోనే సమస్య పరిష్కారం రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన మీదట సమస్యలు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మనమే తిప్పలు పడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సీఎం చొరవతోనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గంటల కొద్దీ చర్చించాం. చివరిలో కావాలని చేసినట్టు ఒకరిద్దరు ఇబ్బందిగా మాట్లాడారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలపై సానుకూలంగా స్పందించి సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే సమస్య పరిష్కారమైంది. రాష్ట్రం ఇంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు పడినా వాటిని అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – మంత్రి పేర్ని నాని ప్రభుత్వానికి కృతజ్ఞతలు రెండు రోజులుగా చీఫ్ సెక్రటరీ, మంత్రి మండలి ఉప సంఘంతో జరిపిన చర్చలు అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో సాగాయి. మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఒంటిగంట వరకు చర్చలు జరిపి.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల్ల పట్ల ప్రేమాభిమానాలను స్పష్టం చేసింది. మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించి, మేము లేవనెత్తిన డిమాండ్లపై కూలంకషంగా చర్చించి వాటి పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అడక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇలా ఎన్నో చేశారు. అందువల్లే మరింత మెరుగైన పీఆర్సీ ఇస్తారని ఆశించాం. అదే స్థాయిలో చాలా వరకు ఇచ్చారు కూడా. అయితే కొన్ని అంశాల్లో మాకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఛలో విజయవాడలో కొంత మంది మాకేదో ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యల విషయంలో అన్యధా భావించవద్దు. ప్రభుత్వం వేరు.. ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులూ మా కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రి చెబుతుంటారు. ఏది ఏమైనా మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఐదు డీఏలు ఒకేసారి ఇవ్వడంతో పాటు మేము కోరుకున్నట్టుగా హెచ్ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీసీఎస్‌ను పునరుద్దరించడం కోసం రూట్‌మ్యాప్ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావడంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాం. ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు, పీఆర్సీ సాధన సమితి సభ్యుడు సీఎం చొరవ అభినందనీయం ముఖ్యమంత్రికి ఉద్యోగుల పట్ల ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారు. 3వ తేదీన భారీ సంఖ్యలో ఉద్యోగులు రోడ్డుమీదకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసి.. 24 గంటలు గడవక ముందే సీఎం స్పందించి మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండ్రోజులుగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సూచనలతో మంత్రుల కమిటీ మాతో సుదీర్ఘంగా చర్చించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను కనుక్కోవడంలో ముఖ్యమంత్రి చూపిన చొరవ అభినందనీయం. ముఖ్యమంత్రికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. మేము ఎక్కువగా రాజీకి వచ్చే అవకాశం లేకుండానే మేము పెట్టిన చాలా డిమాండ్లలో ఒకటి రెండు తప్ప అన్ని డిమాండ్ల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న హెచ్ఆర్ఏ కొనసాగించాలనే డిమాండ్ మేరకు 24 శాతం హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. సీసీఎస్ కొనసాగేలా అంగీకరించినందుకు కృతజ్ఞతలు. 10 ఏళ్ల పీఆర్సీ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రొబేషన్ డిక్లేర్ అయ్యాక కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామన్నారు. ఐదు డీఏలు ఒకేసారి అమలు చేయడం గొప్ప నిర్ణయం. దాంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించారు. మా ఆవేదనలో హద్దుమీరి ఒకరిద్దరు మాట్లాడి ఉంటారు. వారి తరఫున ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నాం. – కె వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత మా సమస్యలు పరిష్కారం ఊహించని రీతిలో మంత్రులు కమిటీ ముందుకొచ్చి మా డిమాండ్ల పరిష్కార దిశగా సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ఒకేసారి ఐదు డీఏలు ఇవ్వడంతో జీతం పెరుగుతుందన్న ఆలోచనతో హెచ్ఆర్ఏ, సీసీఏలు, పెన్షనర్ల బెనిఫిట్లు పూర్తిగా తొలగించడం, కొన్ని తగ్గించడం వంటి చర్యలు వలన ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఈరోజు చర్చలనంతరం ప్రధానంగా మేము కోరుతున్న పీఆర్సీ నివేదికను ఉత్తర్వులతో పాటు ఇస్తామని చెçప్పడం మాకు చాలా సంతోషం కల్గించింది. హెచ్ఆర్ఏ స్లాబ్‌లలో సవరణ, ఐఆర్ రికవరీ చేయడాన్ని నిలుపుదల చేయడం, గతంలో మాదిరిగా పీఆర్సీ 5 ఏళ్ల కోసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, గురుకులాలకు పీఆర్సీ అమలుకు ఉత్తర్వుల జారీ విషయంలో చాలా రోజులు పట్టేది. వీరికి కూడా తక్షణమే పీఆర్సీ అమలయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సపరేట్గా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. పీఆర్సీతో పాటు అనుబంధంగా ఉన్న సీపీఎస్ రద్దు అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ ద్వారా పరిష్కరించే దిశగా సిద్ధం చేస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడానికి ఒప్పుకున్నారు. ఈలోగా ఎంప్లాయిస్ హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు హామీ ఇవ్వడం సంతోషం. కోవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యమ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని పలు సందర్భాల్లో విమర్శించినందుకు అన్యధా భావించవద్దని కోరుతున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పీఆర్సీ సాధన సమితి నేత -
అనాథలకు ప్రభుత్వమే తల్లీతండ్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనాథలకు తల్లి, తండ్రిగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. అనాథల సంరక్షణ కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తామని పేర్కొంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అనాధల సంరక్షణ నిమిత్తం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మొదటిసారి సమావేశమైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనాథల సంక్షేమాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధం ఉందని, ఈ నేపథ్యంలో సబ్ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఇతర రాష్టాలన్నీ అనుసరించే విధంగా సూచనలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, అనాథల కోసం రూపొందించే విధానం కూడా వీటన్నింటినీ మించి ఉంటుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబంగా స్థిరపడే వరకు బాధ్యత అనాథలుగా ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి తల్లిదండ్రులుగా మారి, కుటుంబంగా స్థిరపడేవరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకునేలా కొత్త విధానం ప్రతిపాదిస్తామని సభ్యులు చెప్పారు. పాత చట్టాలకు మార్పులు, సవరణలు కాకుండా సంపూర్ణ, సమగ్ర కొత్త విధానం , కొత్త చట్టం ఉండే విధంగా ఈ సబ్ కమిటీ కసరత్తు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌లు, హోమ్‌లు, ఆశ్రమాలను పటిష్టంగా తయారు చేసేలా, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించేలా ఈ కమిటీ సూచనలు సమర్పిస్తుందని చెప్పారు. -
సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు
సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లోని కమ్యూనిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ మేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి. మార్కెట్ విలువ సవరణలను స్వాగతిస్తూనే.. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంపును మాత్రం డెవలపర్ల సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. విలువ, చార్జీలు రెండూ ఒకేసారి పెంచితే కొనుగోలుదారుల మీద తీవ్రమైన భారం పడుతుందని.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోగా బ్లాక్‌మార్కెట్‌కు ఊతమిచ్చినట్లే అవుతుందని అభిప్రాయపడ్డాయి. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ప్రతీ రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. రాష్ట్రంలో జరిగిన పాలనాపరమైన సంస్కరణల కారణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంతాలలో భూములు, ఆస్తులతో పాటు గ్రామీణ ప్రాంతా లలో వ్యవసాయ భూముల విలువ భారీగా పెరిగాయి. ప్రధానంగా ఏడేళ్లలో హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలు, హెచ్ఎండీఏ పరిధిలోని భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు నిర్ణయించింది. సర్వే నంబర్ల వారీగా విలువల సవరణ.. ప్రస్తుతం తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంప్ డ్యూటీ 4 శాతం, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వం సవరించనున్న భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాల్సిన అవసరముందని ఓ రిటైర్డ్ సబ్‌రిజిస్ట్రార్ సూచించారు. ఏ ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచినా సరే గ్రామాన్ని యూనిట్ ప్రాతిపదికన తీసుకుని సవరిస్తుంటుంది. ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన గ్రామం అంతా ఒకటే విలువ ఉంటుంది. అందుకే అంతర్గత రోడ్లు, అభివృద్ధి కార్యకలాపాలు జరిగే సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువలు పెంచాలి. దీంతో లావాదేవీలను బట్టి చార్జీలు వసూలవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకోవాలి.. కరోనా సమయంలో గృహ కొనుగోలుదారులకు ఉత్సాహం నింపేందుకు, అదే సమయంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మహారాష్ట్ర, పుణే, కర్ణాటక రాష్ట్రాలు స్టాంప్‌డ్యూటీని 3 శాతం తగ్గించాయి. మహారాష్ట్ర, పుణేలలో అన్ని రకాల గృహాలకు స్టాంప్‌డ్యూటీ మినహాయింపునిస్తే.. కర్ణాటకలో మాత్రం రూ.35 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు వెసులుబాటు కల్పించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబర్లో మినహాయింపు ప్రారంభం కాగా ప్రతి నెలా రిజిస్ట్రేషన్లు మూడెంకల వృద్ధిని సాధించాయి. డిసెంబర్లో 204 శాతం, ఈ ఏడాది మేలో 2,489 శాతం, జూన్‌లో 327 శాతం వృద్ధి చెందాయి. ఆదాయం పెంపు అన్వేషణలో తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర విధానాన్ని అవలంభించాలని పలువురు డెవలపర్లు సూచించారు. మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే రెట్టింపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ తగుల్తయ్.. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో బ్లాక్, వైట్ మనీ అంతరాన్ని తగ్గించాలంటే మార్కెట్ విలువ సవరణతోనే సాధ్యమవుతుంది. అయితే ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచితే కొనుగోలుదారులకు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తగుల్తయ్. దీంతో మళ్లీ బ్లాక్ మార్కెట్ దారిలో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే వ్యక్తిగత ఆస్తుల విలువ పెరగదు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల ప్రాపర్టీల అసెట్ వ్యాల్యూ పెరుగుతుంది. దీంతో ఆర్థిక సంస్థలు ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తాయి. మార్కెట్ విలువలు పెరగడం వల్ల 6–12 నెలల పాటు లావాదేవీలు తగ్గిపోతాయి. అప్పటివరకు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచొ ద్దు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య తగ్గుతాయేమో కానీ ఆదాయం విలువ మాత్రం పెరుగుతుంది. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ రిజిస్ట్రేషన్ చార్జీలకూ ఐటీసీ ఇవ్వాలి.. స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్లు ట్రేడ్ అయినట్లుగానే ప్రాపర్టీలు కూడా ట్రేడింగ్ అవుతున్నాయి. ఒకటే ప్రాపర్టీ మీద పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ విలువను తాజా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాలి. అంటే జీఎస్టీలో ఎలాగైతే ఐటీసీ ఇస్తున్నారో అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు ఇవ్వాలి. ఉదాహరణకు రూ.50 లక్షలకు కొన్న అపార్ట్మెంట్.. రెండు మూడేళ్ల తర్వాత రూ.70 లక్షలకు విక్రయిస్తే రూ.70 లక్షల మీద రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయకూడదు. తాజా రిజిస్ట్రేషన్ విలువ నుంచి ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ విలువ రూ.50 లక్షలకు తీసేయాలి. పెరిగిన ధర ఏదయితే ఉందో రూ.20 లక్షల మీదనే రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయాలి. ‘ఒకే దేశం–ఒకే పన్ను’ విధానమైన జీఎస్టీ.. రియల్ ఎస్టేట్ లావాదేవీల విషయంలో మాత్రం అమలవ్వడం లేదు. 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, 5 శాతం జీఎస్టీ రెండూ చెల్లించాల్సి వస్తుంది. – సీ శేఖర్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ -
హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి జారీచేసిన జీఓలను తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ను ఏర్పాటుచేశారన్న విషయాన్ని హైకోర్టు విస్మరించింది. పిటిషన్లు వేసేందుకు అర్హతలేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరపడమే కాకుండా, ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించడాన్ని తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం తన అధికార పరిధిని ఉపయోగించి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టడం సరికాదు’.. అని వారు పేర్కొన్నారు. విచారణాధికారం ప్రభుత్వానికి లేదా? అలాగే, ‘గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అలాంటి ప్రజాస్వామ్యబద్ధ అధికారాన్ని న్యాయస్థానం తిరస్కరించవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న. గత ప్రభుత్వంపై విస్తృత అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు. గత ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్షించే స్వతఃసిద్ధ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పడం ద్వారా హైకోర్టు తప్పుచేసింది. దర్యాప్తు చేయడాన్ని పునః సమీక్షగా హైకోర్టు భావించింది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. దర్యాప్తు చేసే, దర్యాప్తు సంస్థలను ఏర్పాటుచేసే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని న్యాయస్థానం పట్టించుకోలేదు’.. అని అందులో వివరించారు. హైకోర్టు తప్పుగా అర్ధంచేసుకుంది అంతేకాక.. ‘ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు చాలా విస్తృతమైనవి. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయం సరికాదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ఒక్కరే కాబట్టి, పక్షపాతం ఉండే అవకాశం ఉందన్న హైకోర్టు వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. ఏ ప్రభుత్వానికీ అలాంటి దర్యాప్తు చేయడానికి వీలుండదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ప్రభుత్వంలో భాగం కాబట్టి, దానికి పక్షపాతాన్ని ఆపాదించడానికి ఏ మాత్రం వీల్లేదు’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా, సుమోటోగా సీబీఐ దర్యాప్తును కోరలేదు. ఈ విషయాన్ని హైకోర్టు తప్పుగా అర్ధం చేసుకుంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న న్యాయసూత్రాన్ని హైకోర్టు విస్మరించింది’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి తమ పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలని వారు అభ్యర్థించారు. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మహిళల ఆధ్వర్యంలో లక్ష రిటైల్ షాపులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో మహిళల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ షాపుల కేటగిరీలోనే లక్ష వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని సెర్ప్, మెప్మాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర వ్యాపార మార్గాలపైనా చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కానుంది. ► వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సాయంతో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిపై మహిళల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. 19.61 లక్షల మంది తమ ఆసక్తిని తెలియజేయగా, అందులో 10,00,329 మంది ప్రత్యేకంగా తాము ఏ వ్యాపారం చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేశారు. ► వారికి వ్యాపారావకాశాలు కల్పించేందుకు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం నాటి సమావేశంలో చర్చిస్తుంది. ► సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,419 చోట్ల ఇప్పటికే మహిళల ఆధ్వర్యంలో దుకాణాలు ప్రారంభించే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. -
గత ప్రభుత్వ విధానాలను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి కథనాలు ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని పేర్కొన్న హైకోర్టు బుధవారం మరో ఉత్తర్వులను వెలువరించింది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం, ప్రత్యేక దర్యాప్తుబృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. అలాంటి కారణాలు కనిపించడం లేదు... కొన్ని పరిమిత సందర్భాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించగలదని, తమ ముందున్న ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం అలాంటి సందర్భం ఏదీ ఉత్పన్నం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ విధానాలను ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు తప్పనిసరిగా అనుసరించాలని, బలమైన, నిర్థిష్ట కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ దారి నుంచి పక్కకు తొలగవచ్చని, అలాంటి కారణాలు ప్రస్తుత కేసులో స్పష్టంగా కనిపించడం లేదని పేర్కొంది. గత సర్కారు నిర్ణయాలను సమీక్షించాలంటే అందుకు శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, ప్రభుత్వ స్వతఃసిద్ద అధికారం కాదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే విషయంలో ఈ రోజు వరకు ఏ శాసనం కూడా అలాంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదంది. విధానపరమైన లోపాలున్నాయి.. ఎలాంటి అధికారం లేకుండా, ఏకపక్షంగా, అహేతుకంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు కన్నా ముందు దర్యాప్తు చేయడం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటునకు అభ్యర్థన లాంటి విధివిధానాలపరమైన లోపాలున్నాయంది. స్వతఃసిద్ధ వివక్ష, రాష్ట్ర ప్రభుత్వమే ఫిర్యాదుదారు, దర్యాప్తుదారు అన్న దురభిప్రాయాన్ని కలిగించడం, అపరిమిత సమీక్షాధికారం లాంటి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించుకునేందుకు తగిన ఆధారాలు లేవంది. తగినంత సమయం తీసుకున్నా కూడా ఆరోపిత నేరాలకు సంబంధించిన దర్యాప్తులో పురోగతి లేదని తెలిపింది. పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్ వేశానన్న వర్ల... – గత సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, ఉప సంఘం నివేదిక ఆధారంగా అక్రమాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344లను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ జీవోలకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనుబంధ పిటిషన్లు వేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు వర్ల రామయ్య స్వయంగా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రభావితమైన వ్యక్తులే దాఖలు చేస్తారు.. – ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తులే సాధారణంగా రిట్ పిటిషన్లు దాఖలు చేస్తారు. నేరుగా ప్రభావితం కాని వ్యక్తులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారణార్హత లేదని న్యాయస్థానాలు ప్రాథమిక స్థాయిలో తిరస్కరిస్తాయి. ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసుకోవాలని సూచిస్తాయి. అయితే వర్ల, ఆలపాటి రిట్ పిటిషన్లపై ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. బాబు బృందం అక్రమాలను నివేదించిన ప్రభుత్వం – విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అమరాతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతిపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలను సైతం కోర్టుకు సమర్పించింది.వీటిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి రాసిన లేఖను కూడా కోర్టు ముందుంచింది. ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో న్యాయస్థానానికి నివేదించింది. అమరావతి భూ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఈసీఐఆర్ (పోలీసు ఎఫ్ఐఆర్ లాంటిది) నమోదు చేసిందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలని అనుబంధ పిటిషన్లో అభ్యర్థించింది. అయితే వీటిని తోసిపుచ్చుతూ జీవోలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటిపై స్టే ఉత్తర్వులు ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
గత సర్కార్ పాలనంతా అవినీతి, అక్రమాలే..
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, అక్రమాలపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలను కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టుకు నివేదించడంతో తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వీటిపై కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో ముఖ్యాంశాలివీ... ► నిర్ణయాలను సమీక్షించే కార్యనిర్వాహక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పాత నిర్ణయాలను సమీక్షించడం ద్వారా తప్పులను గుర్తించి సరిదిద్దవచ్చు. గత సర్కారు హయాంలో పాలన మొత్తం అవినీతి, సహజ వనరుల దోపిడీ, గనుల అక్రమ తవ్వకాలు, భూముల ఆక్రమణ, పర్యావరణ హననం, రైతుల పట్ల నిర్లక్ష్యం, అక్రమాలతో కూడుకున్నది. ► రాజధాని భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం తేల్చింది. అందులో ఎవరెవరి పాత్ర ఉందో ఆధారాలతో సహా వెల్లడించింది. నివేదికపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. మంత్రి వర్గ ఉప సంఘం సిఫారసుల మేరకే రాజధాని భూ అక్రమాలపై సిట్ ఏర్పాటైంది. ► సిట్ ఏర్పాటు వల్ల వర్ల రామయ్యకు, రాజేంద్ర ప్రసాద్‌కు నష్టం ఏమిటి? గత సర్కారు కొందరు వ్యక్తుల వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. ► ప్రభుత్వ పాలనలో ఏం జరిగిందో, జరుగుతోందో తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలందరికీ ఉంది. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ను ఏర్పాటు చేసినందున వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాం. -
మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటుపై తేల్చేస్తాం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు, ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంగతి తుది విచారణ జరిపి తేల్చేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► రాష్ట్ర విభజన నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను, పాలనాపరమైన చర్యలను, చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షించేందుకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 26న జీవో 1411ను జారీ చేసింది. ► మంత్రి వర్గ ఉప సంఘం ఎత్తిచూపిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 21న జీవో 344 జారీ చేసింది. ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. కేసుల విచారణకు ఓ కోర్టు అవసరం : ఏజీ శ్రీరామ్ ► మంత్రివర్గ ఉప సంఘం ఎత్తిచూపిన గత ప్రభుత్వ అక్రమాల తాలూకు వివరాలను కేంద్రానికి పంపి, సీబీఐ దర్యాప్తునకు ప్రాథమిక సమ్మతిని తెలిపాము. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణ చేపట్టడానికి ముందు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సీబీఐలను కూడా ప్రతివాదులుగా చేర్చాలి. ► సిట్‌ను పోలీస్‌స్టేషన్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో సిట్ నమోదు చేసే కేసులను విచారించేందుకు ఓ కోర్టు అవసరం అవుతుంది. కోర్టు ఏర్పాటు విషయంలో పాలనాపరంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును లిఖిత పూర్వకంగా కోరాం. ► హైకోర్టు ఇప్పటి వరకు పాలనపరమైన నిర్ణయం వెలువరించలేదు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ► ఈ వ్యాజ్యాలపై జస్టిస్ టి.రజనీ సోమవారం మరోసారి విచారణ జరుపుతూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా అవసరం లేదన్నారు. తుది విచారణ జరిపి ఈ వ్యాజ్యాలపై తేల్చేస్తానని చెబుతూ సెప్టెంబర్ 1కి విచారణ వాయిదా వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబు, ఆయన బినామీలు ► సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కోర్టు ముందుంచింది. రాజధాని భూ కుంభకోణానికి సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది. ► మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్.. తన పదవిని అడ్డం పెట్టుకుని ఎలా అధికార రహస్యాలు తెలుసుకుంటూ, తన సమీప బంధువుల ద్వారా కోర్ క్యాపిటల్ ఏరియాలో 41.64 ఎకరాలను కొన్నదీ వివరించింది. ► ఈ 41 ఎకరాలకు పెట్టిన పెట్టుబడి రూ.4.9 కోట్లు అయినప్పటికీ, సీఆర్డీఏ ఒక్కో ఎకరాకు లెక్కించిన విలువ రూ.4 కోట్లు అని, వెరసి సుమారు రూ.169 కోట్లని తెలిపింది. రాజధాని భూముల విషయంలో 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 మధ్య కాలంలో 4,069.44 ఎకరాల లావాదేవీలను వివరించింది. ► ఇన్సైడర్ ట్రేడింగ్ వల్లే ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయంది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పరిటాల సునీత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్‌లో పాలుపంచుకున్నారని వివరించింది. ► లింగమనేని రమేశ్, నారా లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్‌బాబు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎంపీ మురళీమోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు బినామీ లావాదేవీలు నిర్వహించారని పేర్కొంది. -
అత్యుత్తమ క్రీడా విధానాన్ని రూపొందిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఇందుకోసం త్వరలోనే కొత్త క్రీడా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం తొలి సారి సమావేశమైంది. ఇందులో కేటీఆర్‌తో పాటు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలు, అకాడమీలు, కోచ్‌లు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ‘శాట్స్’ అధికారులు కేటీఆర్‌కు అందజేశారు. కొత్త క్రీడా విధానానికి రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. తర్వాతి సబ్ కమిటీ సమావేశంలో క్రీడాకారులు, కోచ్‌లను కూడా ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. -
గత సర్కారు అవినీతిని నిగ్గు తేల్చనున్న సిట్
-
రాజధాని అక్రమాలపై ‘సిట్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. భూ సేకరణతోపాటు గత సర్కారు హయాంలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు నిమిత్తం దీనిని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి పాలకపక్ష నేతలు అధికార రహస్యాల ప్రతిజ్ఞను తుంగలో తొక్కి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, అసైన్డ్ చట్టాన్ని తుత్తునియలు చేస్తూ అడ్డగోలుగా, బలవంతంగా, కారు చౌకగా పేదల నుంచి భూములు కొన్నారని.. సరిహద్దులు మార్చి అడ్డగోలుగా లబ్ధి పొందారని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. (మూడు రాజధానులు ముమ్మాటికీ అవసరమే) ఆ మేరకు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో పది మందితో కూడిన ‘సిట్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు తదితరాలపై సమీక్షించేందుకు జీవో 1411 ద్వారా గతేడాది జూన్ 26న మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. సీఆర్డీఏ ప్రాంతంలో భూ సేకరణతోపాటు పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ పరమైన లోపాలతోపాటు నకిలీ లావాదేవీలు, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉప సంఘం గుర్తించింది. (వెనకుండి నడిపిందెవరు?) పాత్రధారులు, సూత్రధారులెవరో తేల్చాలనే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీ అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదికపై గత అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగింది. ఎవరెవరు అసైన్డ్ భూములు కొన్నారు? ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కారుచౌకగా దక్కించుకున్నారనే వివరాలను పేర్లు, సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. తమ నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను కొన్నట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. (అమరావతి ఆందోళనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు) ఈ మేరకు కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంతోపాటు రాజధాని భూకుంభకోణంలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, నాటి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బినామీల హస్తం ఉందని రిజిస్ట్రేషన్ లావాదేవీలు, భూముల కొనుగోలు సాక్షిగా తేలిపోయింది. అందువల్ల ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులను తేల్చడంతోపాటు మొత్తం అక్రమాలను బట్టబయలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్థాయి అధికారాలు అప్పగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. (‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!) విధి విధానాలు.. – గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సీఆర్పీసీ నిబంధనల ప్రకారం దర్యాప్తు. – అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కలిసి పని చేయొచ్చు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు. – అవసరమైన పక్షంలో విచారణ నిమిత్తం ఎవరినైనా పలిపించి, ప్రశ్నించే సంపూర్ణ అధికారం. వారి వాదనను సిట్ రికార్డు చేస్తుంది. – భూ లావాదేవీలు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఏ రికార్డులనైనా పరిశీలించే అధికారం. – అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు ‘సిట్’ కోరిన సమాచారాన్ని అందజేయడంతోపాటు సంపూర్ణ సహకారం అందించాలి. పక్కా ఇన్సైడర్ ట్రేడింగ్ రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనంలో తేలింది. గత పాలకులు రాజధాని నూజివీడులో వస్తుందని ఒకసారి, మరో చోట వస్తుందని మరో సారి, ఇంకో చోట వస్తుందని ఇంకోసారి.. లీకులిచ్చి సామాన్యులు భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేశారు. పాలక పెద్దలు మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొన్నారు. ఇలా వారు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. ఇందుకు కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆధారంగా ఉన్నాయని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకు ప్రభుత్వం అసెంబ్లీలోనే బట్టబయలు చేసింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ మధ్య రాజధాని ప్రకటనకు ముందు.. వాస్తవ రాజధాని ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు భూములు కొన్నారో ఆధార సహితంగా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. బినామీల పేరుతో కారుచౌకగా కొనుగోలు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. ఇలా టీడీపీ పెద్దలు అమరావతి ప్రాంతంలో 4,075 ఎకరాల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ 14.22 ఎకరాలు తాడికొండ మండలం కంతేరులో కొనింది. టీడీపీ నేత లంకా దినకర్ (లోకేశ్ బినామి), జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, అప్పటి మంత్రి నారాయణ, కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్రావు కుటుంబీకురాలు)లాంటి వారెందరో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా భూములు కొన్నారు. సరిహద్దులు మార్చి భారీగా లబ్ధి చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో సరిపెట్టుకో లేదు. లంక, పొరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్డీఏ సరిహద్దులు సైతం మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చదరపు కిలోమీటర్ల మేర ప్లాన్ చేశారు. అయితే వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని 2016లో దానిని 217 చదరపు కిలోమీటర్లకు తగ్గించారు. తమ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వకుండా కాపాడుకుని అధిక విలువ పొందడమే లక్ష్యంగా వ్యవహరించారు. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. లేని భూములు ఇచ్చి.. కోట్లకు పడగలెత్తి.. అనంతవరంలో భూభాగోతం మరోరకంగా సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు దక్కించుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకాయలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడిలో 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూముల విషయంలోనూ ఇలాగే చేశారు. కాగా, ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు కట్టబెడుతూ, ప్రభుత్వ సంస్థలకు మాత్రం అధిక ధరలకు ఇచ్చిన వైనం కూడా వెలుగు చూసింది. సీఐడీ విచారణలోనూ అక్రమాలు బట్టబయలు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్ కో సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషించిన అప్పటి మంత్రి పి.నారాయణ తన సమీప బంధువులు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది పేర్లతో ఇన్సైడరన్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు. వందలాది మంది తెల్లకార్డుదారులు భారీగా భూములు కొనుగోలు చేసిన విషయం కూడా బట్టబయలైంది. సిట్ బృందమిదే.. డాక్టర్ కొల్లి రఘురామ్ రెడ్డి (డీఐజీ, ఇంటెలిజెన్స్–బృంద నాయకుడు),అత్తాడ బాబూజీ (విశాఖపట్నం ఎస్పీ),సీహెచ్ వెంకట అప్పలనాయుడు (ఎస్పీ–2 ఇంటెలిజెన్స్), సీహెచ్ శ్రీనివాస రెడ్డి, (అడిషనల్ ఎస్పీ, కడప), జయరామరాజు (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), విజయ భాస్కర్ (డీఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్), ఎం.గిరిధర్ (డీఎస్పీ, ఇంటెలిజెన్స్), కెన్నెడి (ఇన్స్పెక్టర్, ఏలూరు రేంజి), ఐ.శ్రీనివాసన్ (ఇన్స్పెక్టర్, నెల్లూరు జిల్లా), ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి (ఇన్స్పెక్టర్, గుంటూరు జిల్లా). -
కొత్త సచివాలయ నిర్మాణం పై నివేదిక
-
కూల్చివేయడమే కరెక్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇవి ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నాయని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు యోచిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున, సచివాలయం కోసం కొత్త భవన నిర్మాణం సముచితమేనని ఉపసంఘం తేల్చిచెప్పింది. ప్రస్తుత సచి వాలయం భవనంలో మార్పుచేర్పులు చేసి కొనసాగించ డానికి కూడా ఏమాత్రం అనువుగా లేదని పేర్కొంది. ప్రస్తుత భవన సముదాయంలోని ఎ, బి, సి, డి, జి, హెచ్ నార్త్, జె, కె బ్లాకుల్లో అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని, మార్పులు చేసినప్పటికీ ఫైరింజన్ వెళ్లడం కుదరదని స్పష్టంచేసింది. అంతేకాకుండా ప్రస్తుత సచివాలంలో వీవీఐపీ, వీఐపీలకు భద్రత సరిగా లేదని.. వీఐపీలకు, అధికారులకు, సందర్శులకు అందరికీ ఒకే ఎంట్రన్స్, ఒకే ఎగ్జిట్ ఉన్నాయని.. ఆయా బ్లాకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది వారి భద్రతకు ఏ మాత్రం క్షేమకరం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఎంఓ, మంత్రులు, అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారని.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లను వివిధ బ్లాకులకు తిప్పాల్సి వస్తున్నందున అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయని పేర్కొంది. మంత్రి వేములతో సీఎం చర్చలు తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన నలుగురు ఈఎన్సీలతో ఓ నిపుణుల కమిటీని నియమిస్తూ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సచివాలయ భవనంలో మార్పులు, చేర్పులు చేసి కొనసాగించాలా? లేక కొత్త భవనం నిర్మించాలా? అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ.. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌తో విస్తృతంగా చర్చించింది. అలాగే సచివాలయ భవన సముదాయం ప్రాంగణాన్ని సునిశితంగా పరిశీలించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మంత్రివర్గ ఉపసంఘానికి తన నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఉపసంఘం.. తన అభిప్రాయాలతో కూడిన నివేదికను నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. దీనిపై గురువారం రాత్రి సీఎం కేసీఆర్.. ఉపసంఘానికి నేతృత్వం వహించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో చర్చించారు. సబ్ కమిటీ నేవేదిక నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేత దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. -
నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయితే వాటికి లొంగే ప్రసక్తే లేదని తెలిపారు. టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకువచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏది చూసినా వందలు, వేలకోట్ల రూపాయాల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసినవారిని వదిలేయాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం విషయాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుండా అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి కదా? అని అన్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీనివల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందని అన్నారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని, ఒత్తిళ్లను ఖాతరు చేయొద్దని సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్ కమిటీ చేపట్టింది. ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి ఈ మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. -
‘పోలవరం’ అక్రమాలపై ప్రశ్నల వర్షం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో జలవనరుల శాఖ అధికారులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రశ్నల వర్షం కురిపించింది. కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని ఎలా పెంచారంటూ నిలదీసింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా లంప్సమ్(ఎల్ఎస్)–ఓపెన్ విధానంలో నవయుగ సంస్థకు రూ.3,102.37 కోట్ల విలువైన పనులు, బీకెమ్‌కు రూ.387.56 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో ఎలా అప్పగించారని ప్రశ్నించింది. పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని పేర్కొంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల మేరకు పోలవరం పనులు చేపట్టామని జలవనరుల శాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌పై(జలాశయం) విచారణ చేపట్టింది. హెడ్ వర్క్స్‌లో 2005 నుంచి ఇప్పటివరకూ చేసిన పనులను ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు వివరించారు. పీపీఏ అనుమతి ఎందుకు తీసుకోలేదు? హెడ్ వర్క్స్‌ను రూ.4,054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ సంస్థ 2013లో దక్కించుకుందని.. ఆ ఒప్పందం గడువు 2018 మార్చి వరకూ ఉందని, కానీ పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన మరుసటి రోజే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు ఎలా పెంచడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను నిలదీసింది. అంచనా వ్యయం పెంచినప్పుడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అనుమతి ఎందుకు తీసుకోలేదని అడిగింది. అప్పటి రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల అంచనా వ్యయాన్ని పెంచామని అధికారులు తెలియజేశారు. అంచనా వ్యయం పెంచడం ద్వారా కాంట్రాక్టర్‌కు రూ.1,481.91 కోట్ల మేర ప్రజాధనాన్ని దోచిపెట్టినట్లయిందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి కీలకమైన పనులను ఇతర సంస్థలకు సబ్ కాంట్రాక్టుకు ఎలా అప్పగించారని ప్రశ్నించింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి రోజు వారీ ఖర్చుల కోసం రూ.170 కోట్లతో ఏర్పాటు చేసిన నిధి, నవయుగకు రివాల్వింగ్ ఫండ్‌గా ఇచ్చిన రూ.50 కోట్ల వ్యయానికి సరైన లెక్కలు చూపకపోవడంపై ఉపసంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే సమావేశం నాటికి హెడ్ వర్క్స్‌తోపాటు కనెక్టివిటీస్, కుడి, ఎడమ కాలువ పనులకు సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. -
కక్ష కాదు.. రక్ష
సాక్షి, అమరావతి: ప్రజాధనం ఆదా చేయడానికే తప్ప ఎవరి మీదో కక్ష, ద్వేషంతో అవినీతిపై విచారణ చేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలకు తావు లేదని, కేవలం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవినీతి జరక్కుండా సక్రమంగా వాడుకోవడమేనని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. గత టీడీపీ సర్కారులో జరిగిన అన్ని రకాల అవినీతి, కుంభకోణాలతో పాటు పలు విధానపరమైన నిర్ణయాల్లో వెనుక గల దురుద్దేశాలపై విచారణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో దిశా నిర్దేశం చేశారు. ఆయా శాఖల్లో జరిగిన తప్పులు, లోపాలను గుర్తించాలన్నారు. ప్రజా ధనం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం, వృధా కాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా అవినీతి జరగకూడదని, ప్రతి శాఖలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందని, జరుగుతున్న పనులను పరిశీలించి.. ఏ తప్పు జరిగినా ఆ పనులను వెంటనే ఆపేయాలని సూచించారు. రీ టెండరింగ్ నిర్వహించి ప్రజల డబ్బును ఆదా చేసి చూపగలిగితే.. మొత్తం వ్యవస్థకు చక్కటి సంకేతాన్ని పంపినట్లవుతుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో చేపట్టే పనుల్లో పోలవరం ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. ఎవరినైనా వివరణ కోరవచ్చు.. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఎవరినైనా పిలవచ్చని, వివరణ కోరవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవచ్చని చెప్పారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి ఏం జరుగుతుందో నిరంతర పరిశీలన చేసుకుని మదింపు చేసుకోవాలని సూచించారు. గత టీడీపీ సర్కారులో జరిగిన అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఆధారాలను సేకరించాలని, వ్యవస్థను క్లీన్ చేయడానికి ఆపరేషన్ ప్రారంభిస్తూ 45 రోజుల్లో పని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెండు వారాలకోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా తాను పాల్గొంటానని చెప్పారు. నేరుగా, పక్కాగా దొరికిన స్కాంలపై తొలుత దృష్టి సారించాలని, ఇప్పుడు జరుగుతున్న పనులు ఇచ్చిన ధర కన్నా తక్కువకే జరుగుతాయనుకుంటే వెంటనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలోనే ఏటా రెండు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. రివర్స్ టెండరింగ్‌లో ఎక్కువ మంది పాల్గొనాలి ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా తప్పు జరిగిందని తేలితే రివర్స్ టెండరింగ్ నిర్వహించవచ్చునని, ఆ తాజా టెండరింగ్‌లో ఇప్పుడు కొనసాగుతున్న కాంట్రాక్టర్ కూడా పాల్గొనవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కువ మంది టెండరింగ్‌లో పాల్గొనేలా చేస్తే, తక్కువకు కోట్ చేస్తారని, తద్వారా ప్రజాధనం ఆదా కావాలన్నదే తమ లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు. పోలవరం, వెలిగొండ, అర్బన్ హౌసింగ్‌లపై తక్షణం దృష్టి సారించి, వెంటనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు. అర్బన్ హౌసింగ్‌లో యూనిట్ల సైజును తగ్గిస్తే ఎక్కువ మంది పాల్గొంటారనే విషయంపై సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసి, ఆయా శాఖలే రివర్స్ టెండరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. అవినీతిని అరికట్టి, రివర్స్ టెండరింగ్ చేసే అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని, అందరిలో స్ఫూర్తి నింపడానికే ఈ చర్య అని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఆదరబాదరగా టెండర్లను ఖరారు చేసి ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను రివకరీ చేయాలని ఆదేశించారు. పోలవరం అవినీతిని 15 రోజుల్లో తేల్చాలని చెప్పారు. సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులైన ఎంపీలు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, పీవీ మిధున్‌రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌లు పాల్గొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి జరిగిన అన్ని శాఖల్లోనూ విచారణ : మంత్రులు బుగ్గన, కన్నబాబు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి అన్ని శాఖల్లో, ప్రతి అంశంపైనా కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ ఉపసంఘం నాలుగైదు రోజులకొకసారి సమావేశం కావాలని, 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. టీడీపీ పాలన గురించి ఎంతో మంది నిపుణులు, మాజీ అధికారుల నుంచి విపరీతంగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయని, ఈ నేపథ్యంలో అవినీతిపై విచారణ చేసి, సంబంధిత శాఖలను దారిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 26న 1411 నంబర్ జీవో ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఐదేళ్లలో ప్రజాధనం సద్వినియోగం అయిందా లేక అన్నింట్లో అవినీతి జరిగిందా.. జరిగి ఉంటే ఎలా సరిచేయాలనే అంశాలను సబ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాజధాని భూసేకరణ, భూ కేటాయింపులపై చర్చించామని తెలిపారు. ప్రాజెక్టులు, దోమలపై దండయాత్ర అంటూ ప్రతి పనిలోనూ అవినీతేనని అన్నారు. కృష్ణా– గోదావరి పుష్కరాలలో వాటర్ ప్యాకెట్లు, షామియానాలు, ఎలుకలు పట్టేందుకు ఒక్కొక్క ఎలుకకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టారని తెలిపారు. పారదర్శక పాలనే ప్రభుత్వ ధ్యేయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాల్టికి (ఆదివారం) సరిగ్గా నెల రోజులైందని, ఇంత తక్కువ వ్యవధిలోనే వైఎస్ జగన్ పాలన ఎంతో పారదర్శకంగా ఉందని ప్రజలు చెబుతున్నారని మంత్రులు బుగ్గన, కన్నబాబు అన్నారు. సబ్ కమిటీ నివేదిక కూడా అంతే పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుందని, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.18 వేలకు పెంచడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ప్రకాశం జిల్లాలో రైతు భూమిలో డీసీసీబీ బ్యాంకు అధికారులు జెండాలు పాతారని తమ దృష్టికి వచ్చిందని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులన్నింటికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గౌరవప్రదంగా రుణాలు వసూలు చేయాలని చెప్పామన్నారు. వడ్డీలేని రుణాలు, రైతు భరోసా, రైతుకు బీమా ప్రీమియం పూర్తిగా చెల్లింపు కార్యక్రమాలను సీఎం ప్రకటించారన్నారు. రైతులు సంయమనంతో ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. -
కమిటీ నివేదిక ఆధారంగా కార్యాచరణ
-
45 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రతి అంశంపైనా కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సుమారు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ప్రజా ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. ‘కేబినెట్ సబ్ కమిటీ కూడా అదే లక్ష్యంగా పనిచేస్తుంది. అవినీతికి సంబంధించి అన్ని అంశాలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. ప్రజాధనం కాపాడటం, వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 45 రోజుల్లో కమిటీ విచారణ పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. చదవండి: మంత్రివర్గ ఉప సంఘంతో సీఎం జగన్ భేటీ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అన్నింటిలోనూ విపరీతమైన అవినీతి జరిగింది. గత అయిదేళ్లలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని స్వచ్ఛంద సంస్థలు నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికల ఆధారంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అవినీతిని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల పాలన ఎంతో పారదర్శకంగా ఉంది. సబ్ కమిటీ నివేదిక కూడా అంతే పారదర్శకంగా ఉంటుంది. ప్రజలుకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రభుత్వ బాధ్యత. జీతాలు పెరగాలంటే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ముఖ్యమంత్రే స్వయంగా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేలు జీతం ఇవ్వాలని ప్రకటించారు.’ అని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆగస్ట్ 1 నుంచి సీఎం ప్రజా దర్బార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతుల నుంచి రుణాలు వసూలు చేసేందుకు కొన్ని బ్యాంకులు, డీసీసీబీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. బ్యాంకులు రైతులతో సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు చెప్పారు. అవినీతి జరిగిన అన్ని శాఖల్లోనూ విచారణ గత అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అధికారులు వెల్లడించారన్నారు. ప్రాజెక్టులు నిర్మాణాత్మక పనుల్లో ఎక్కువ అవినీతి జరిగిందన్నారు. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి జరిగిన అన్ని శాఖల్లోనూ విచారణ జరుపుతామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాజధాని భూ సేకరణ, భూ కేటాయింపులపై చర్చించినట్లు బుగ్గన తెలిపారు. పారదర్శక పాలనే ప్రభుత్వ ధ్యేయమని, రాజధాని భూములు, భూ కేటాయింపులు, ప్రాజెక్టులు, దోమలపై దండయాత్ర నుంచి ప్రతి పనిలోనూ అవినీతేనని అన్నారు. ఈ విచారణ వల్ల గతంలో జరిగిన అవినీతి బయటపడుతుందని బుగ్గన పేర్కొన్నారు. కాగా మంత్రివర్గ ఉప సంఘంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డి ఉన్నారు. అలాగే ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. -
మంత్రివర్గ ఉప సంఘంతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
మంత్రివర్గ ఉప సంఘంతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం అయ్యారు. గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్ కమిటీకి అప్పగించారు. తొలిసారి ఈ మంత్రివర్గ ఉపసంఘంతో వైఎస్ జగన్ భేటీ జరుగుతోంది. ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో సబ్‌కమిటీకి సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. కాగా రాష్ట్రంలో ఐదేళ్లుగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకున్న తీరుపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, కమీషన్లే లక్ష్యంగా పని చేసి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిన వైనాన్ని ఎత్తిచూపాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. చదవండి: అవినీతి నిగ్గు తేల్చండి -
అందరూ ఆహ్వానితులే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. విదేశాలకు చెందిన 37 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 56 మందిని మహాసభలకు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. వీరి రవాణా ఖర్చులతోపాటు భోజన వసతి సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. గురువారం సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాటు కోసం ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం తొలిసారిగా భేటీ అయింది. డిప్యూటీ సీఎం కడియం ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, చందూలాల్‌తోపాటు మహాసభల నిర్వహణ కమిటీతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను ప్రజలందరి సహకారంతో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతినిధుల నమోదు చేపట్టామని.. మొత్తం 7,900 మందికిపైగా ప్రతినిధులు తెలుగు మహాసభలకు పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. 40 దేశాల నుంచి 160 మంది, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి 1,167 మంది, తెలంగాణ నుంచి 6 వేల మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. పుస్తక ప్రదర్శన, ఫుడ్ స్టాళ్లు.. ప్రతినిధులుగా నమోదు చేసుకోని వారు కూడా మహాసభలకు హాజరుకావచ్చని కడియం తెలిపారు. తెలంగాణ భాషను, యాసను, జీవన విధానాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రోజువారీగా కార్యక్రమాల షెడ్యూలు, నిర్ణీత వేళలు అందరికీ ముందుగానే తెలిసేందుకు ప్రచారం చేస్తామని అన్నారు. తెలంగాణ రచనలను, పుస్తకాలను పరిచయం చేసేందుకు వీలుగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని, తెలంగాణ ఆహారపు అలవాట్లను తెలియజేసేందుకు ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా పేరు తెచ్చిన హస్త కళలు, చేనేత చీరల స్టాళ్లు ఉంటాయన్నారు. ఏపీకి చెందిన తెలుగు భాషా పండితులు, సాహిత్యాభిమానులను మహాసభలకు ఆహ్వానించామని, ప్రత్యేకంగా కొందరికి సన్మానం చేస్తామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు కడియం తెలిపారు. మహాసభల్లో భాగంగా ఈనెల 18న సినీ సంగీత విభావరిని నిర్వహించడంతోపాటు సినీ ప్రముఖులకు సన్మానం చేస్తామన్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ, గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం అదనపు పథకం
ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా జలాల తరలింపు ♦ మంత్రివర్గ ఉపసంఘం సూచన ♦ ముఖ్యమంత్రికి సిఫారసు చేయాలని నిర్ణయం ♦ రూ.650 కోట్ల అంచనాతో ఎత్తిపోతలు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం అదనపు (సప్లిమెంటేషన్) పథకాన్ని చేపట్టాలని నీటిపారుదలరంగంపై నియమిం చిన మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయ పడింది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించేలా ప్రణా ళికకు ఓకే చెప్పింది. వరద కాల్వపై మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించి, ఎల్లంపల్లి ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సిఫారసు చేయా లని ఉపసంఘం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో ఎస్సారెస్పీ వరద కాలువపై కేబినెట్ సబ్‌కమిటీ సుదీర్ఘంగా సమీక్షించింది. సబ్ కమిటీ చైర్మన్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వర్షాలు కురవని సంవత్సరాలలో శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) పరిధిలోని రైతాంగం ఇబ్బందులకు గురి కాకుండా సాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అతి తక్కువ భూసేకరణతో వేగంగా పూర్తి చేసే మార్గాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ స్థితిగతులపై ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రోజుకు 0.75 టీఎంసీల నీరు తరలింపు.. నిజానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లక్ష్యం ప్రకారం 9 లక్షల 73 వేల ఎకరాలకు సాగునీరందడానికి 95 టీఎంసీలు కావాలి. ఎగువ ప్రాంతాల్లో బాబ్లీ వంటి ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాంసాగర్‌కు ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఎస్సారెస్పీలో 54 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉన్నది. ఫలితంగా పూర్తి ఆయకట్టుకు నీరందించడం కష్టంగా మారిందని ఇంజనీర్లు తెలిపారు. ఈ దృష్ట్యా దాదాపు రూ.650 కోట్ల వ్యయ అంచనాలతో 31 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మించి ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు నీటి తరలింపు పథకాన్ని ప్రతిపాదించారు. రోజుకు 0.75 టీఎంసీల నీటిని ఈ పథకం నుంచి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిపై కమిటీ స్పందిస్తూ, ఈ పథకాన్ని 10 నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. వరద కాలువలో అవసరమైన చోట్ల లైనింగ్ పనులు జరపాలని సూచించింది. మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నందున ఈ సంవత్సరం ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు అనుసంధానం చేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ఈ అనుసంధానంలో భాగంగా రోజుకు 0.75 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ లోకి ఎత్తిపోసేందుకు సంకల్పించామన్నారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ సూచించిన ఎస్సారెస్పీ సప్లిమెంటు పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పై ఆధారపడిన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కెనాల్లు సహా ఇతర ఎత్తిపోతల పథకాల ఆయకట్టును స్థిరీకరించడం, ప్రాజెక్టు పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలతో పాటు జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లోని మెట్ట భూములకు లక్ష ఎకరాలలో సాగు నీరందే అవకాశం ఉంది. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్ సీఎస్ జోషి తదితరులు పాల్గొన్నారు. -
భారీ పరిశ్రమగా గొర్రెల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసే సంకల్పంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ప్రగతి భవన్లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకం కానున్నా యని అన్నారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి గొర్రెల పెంపకం పరిశ్రమ ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ రెండు రంగాలను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొం దించేలా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్రెడ్డిలను సభ్యులుగా నియమించారు. నీటిపారుదల రంగం ద్వారా ప్రజలకు భారీ మేలు జరగనుందని, వివిధ వృత్తులపై ఆధారపడిన ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రణాళికను ప్రభుత్వం రూపొం దిస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. గొర్రెల పెంపకానికి శాఖాపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల సంపద అభివృద్ధి ద్వారా యాదవులంతా ఆర్థికంగా ఎదగాలన్నారు. సమావేశంలో స్పీకర్ మధుసూదనచారి, మంత్రులు నాయిని, ఈటల, తలసాని, పోచారం, తుమ్మల, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశు సంవర్ధకశాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, మెదక్ జెడ్పీ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు.