
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో మహిళల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ షాపుల కేటగిరీలోనే లక్ష వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని సెర్ప్, మెప్మాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర వ్యాపార మార్గాలపైనా చర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కానుంది.
► వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సాయంతో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిపై మహిళల నుంచి అధికారులు అభిప్రాయాలు సేకరించారు. 19.61 లక్షల మంది తమ ఆసక్తిని తెలియజేయగా, అందులో 10,00,329 మంది ప్రత్యేకంగా తాము ఏ వ్యాపారం చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేశారు.
► వారికి వ్యాపారావకాశాలు కల్పించేందుకు వివిధ శాఖల ద్వారా చేపడుతున్న చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం నాటి సమావేశంలో చర్చిస్తుంది.
► సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,419 చోట్ల ఇప్పటికే మహిళల ఆధ్వర్యంలో దుకాణాలు ప్రారంభించే ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment