సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం అయ్యారు. గత ప్రభుత్వ పాలసీలను సమీక్షించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 30 అంశాల్లో అవినీతిని వెలికితీసే బాధ్యతను ఈ సబ్ కమిటీకి అప్పగించారు. తొలిసారి ఈ మంత్రివర్గ ఉపసంఘంతో వైఎస్ జగన్ భేటీ జరుగుతోంది. ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో సబ్‌కమిటీకి సూచనలు ఇవ్వనున్నారని సమాచారం. కాగా రాష్ట్రంలో ఐదేళ్లుగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకున్న తీరుపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, కమీషన్లే లక్ష్యంగా పని చేసి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిన వైనాన్ని ఎత్తిచూపాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
చదవండి: అవినీతి నిగ్గు తేల్చండి
Comments
Please login to add a commentAdd a comment