గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రతి అంశంపైనా కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు సుమారు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ప‍్రజా ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు.