
'ఎలా చేస్తారో తెలియదు.. కానీ చేస్తారు'
అనంతపురం: అన్నా క్యాంటీన్లు, పెన్షన్ల కంటే పంట రుణాల మాఫీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. చంద్రబాబు రుణమాఫీ ఎలా చేస్తారో తనకు తెలియదు కానీ చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థికలోటులో ఉంది. మూడు నెలల్లోనే హామీలు నెరవేర్చాలని అనడం సరికాదన్నారు. ఏపీలో కాంగ్రెస్ లో భవిష్యత్ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 80 టీఎంసీల నీళ్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని జేసీ చెప్పారు.