వంద శాతం రుణమాఫీ అయిపోయినట్లే: జేసీ | hundred percent crop loan waiver over, says jc diwakar reddy | Sakshi
Sakshi News home page

వంద శాతం రుణమాఫీ అయిపోయినట్లే: జేసీ

Published Tue, Dec 9 2014 2:52 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వంద శాతం రుణమాఫీ అయిపోయినట్లే: జేసీ - Sakshi

వంద శాతం రుణమాఫీ అయిపోయినట్లే: జేసీ

అనంతపురం: వంద శాతం రైతుల రుణమాఫీ అయిపోయినట్లేనని అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ అమల్లోకి వచ్చినందున ఈ అంశంపై విపక్షాలు రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. సోమవారం అనంతపురంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ అమలు చేశారన్నారు. ఇందులో పెద్ద రైతులకు అన్యాయం జరిగి ఉండొచ్చని, అంత మాత్రాన విమర్శలు గుప్పించడం భావ్యం కాదన్నారు. చంద్రబాబు ఆరు మాసాల పాలన ముగిసిందని, ఏ ప్రభుత్వానికైనా రెండేళ్ల సమయం ఇచ్చి తరువాత ఫలితాలు ఆశించాలన్నారు. విభజన నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement