
అనంతపురం క్రైం : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం అనంతపురంలోని డీపీవోలో గన్‌మెన్ల కోసం ఎస్పీ బి.సత్యయేసు బాబును కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని, అయితే ఎస్‌ఈసీపదవీ కాలం వచ్చే ఏడాది మార్చికి అయిపోతుందని, కానీ సీఎం వైఎస్ జగన్ పాలన మరో మూడేళ్లు ఉంటుందన్నారు. సీఎం వైఎస్ జగన్, ఆయన మంత్రులు, అనుచరులు ఎన్నికలపై కోర్టుకెళ్తారన్నారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు రాజకీయ రంగు పులమొద్దని జేసీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment