
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
సాక్షి,కొప్పల్ (కర్ణాటక) : అవినీతిలో బీజేపీ ప్రపంచ రికార్డులు సాధించిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌కు అవినీతి మకిలి అంటలేదని కితాబిచ్చారు. ఉత్తర కర్ణాటకలో రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన రాహుల్ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు స్కాములతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ఏలుబడిలో కనీసం ఒక్క కుంభకోణం కూడా చోటుచేసుకోలేదని బీజేపీ హయాంలో మైనింగ్ స్కాం సహా పలు కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనాశీర్వాద్ యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం పలు సభల్లో ప్రసంగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. గత బీజేపీ ప్రభుత్వంలో ముగ్గురు సీఎంలు మారారని, నలుగురు మంత్రులు జైలు శిక్ష అనుభవిస్తూ రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. ఇంతజరిగినా ప్రధాని మోదీ ఇక్కడకి వచ్చి కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment