కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. గురువారం పెను ప్రమాదం నుంచి రాహుల్ తృటిలో బయటపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం గురువారం ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన బయలుదేరగా.. హఠాత్తుగా సమస్య తలెత్తింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి హెబ్బలి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.
ఆటోపైలెట్ మోడ్ ఒక్కసారిగా ఆగిపోవటంతో విమానం ఒక్కసారిగా గాల్లో పక్కకు ఒరిగిపోయింది. ఆపై వేగంగా విమానం కిందకు జారిపోతుండటంతో పైలెట్ అప్రమత్తమై ఎయిర్‌క్రాఫ్ట్‌ను మ్యానువల్ మోడ్‌లోకి తెచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. బలమైన గాలులు వీయటంతో ఈ సమస్య తలెత్తిందని ఓవైపు అధికారులు చెబుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ‘ప్రమాద సమయంలో వాతావరణం సాధారణంగా ఉంది. ఇలా ఖచ్ఛితంగా సాంకేతిక సమస్యే. ఘటనపై మాకు అనుమానాలు ఉన్నాయి. పైగా సమస్య ఏంటన్నది పైలెట్లు కూడా వివరించలేకపోతున్నారు’ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పోలీసు ఫిర్యాదు.. కాగా, ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ అనుచరుడు కౌశల్ విద్యార్థి.. కర్ణాటక డీజీపీ నీల్‌మణి ఎన్ రాజుకు ఓ లేఖ రాశారు. అంతేకాదు ఘటనపై పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలంటూ డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఆయన ఇంకో లేఖ రాశారు.
Complaint to the DG&IG of Police, Karnataka, regarding the serious malfunction of the aircraft carrying Congress President @RahulGandhi pic.twitter.com/P3RJwkWOMR
— Congress (@INCIndia) 26 April 2018
Comments
Please login to add a commentAdd a comment