ఇస్లామాబాద్ : తమ ఉద్యోగాలు కోల్పోయేలా చేసిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై బహిష్కృత జర్నలిస్టులు వినూత్న నిరసన చేపట్టారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన పకోడీ మంత్రను అనుసరించి రోడ్డుపై బైఠాయించి మంగళవారం పకోడీలు వేశారు. పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం చర్యల వల్ల ఉద్యోగాలు కోల్పయిన తమ దుర్భర పరిస్థితిని వెళ్లగక్కారు. ఈ కార్యక్రంమలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో పాల్గొని జర్నలిస్టులకు తన మద్దతు ప్రకటించారు.
ఇమ్రాన్ ఖాన్ వచ్చాకే ఇదంతా..
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ అధికారంలోకి వచ్చాక మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసారాలపై ఆంక్షల నేపథ్యంలో పత్రికలు, టీవీ చానెళ్లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు సైతం నిలిపివేయడంతో నెలనెలా జీతాలు చెల్లించడానికి సంకటంగా మారిందనీ, దాంతో యాజమాన్యాలు తమను తొలగించింయని ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం నిలిచిపోవడంతో ‘వక్త్ న్యూస్’టీవీ చానెల్ మూతపడడం గమనార్హం.
నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో
Whole of the Waqt News staff sacked and offices across Pakistan shut down.
— Matiullah Jan (@Matiullahjan919) October 29, 2018
Comments
Please login to add a commentAdd a comment