Journalist problems
-
పాకిస్తాన్లో మోదీ మంత్ర
ఇస్లామాబాద్ : తమ ఉద్యోగాలు కోల్పోయేలా చేసిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై బహిష్కృత జర్నలిస్టులు వినూత్న నిరసన చేపట్టారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన పకోడీ మంత్రను అనుసరించి రోడ్డుపై బైఠాయించి మంగళవారం పకోడీలు వేశారు. పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వం చర్యల వల్ల ఉద్యోగాలు కోల్పయిన తమ దుర్భర పరిస్థితిని వెళ్లగక్కారు. ఈ కార్యక్రంమలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో పాల్గొని జర్నలిస్టులకు తన మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ వచ్చాకే ఇదంతా.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ అధికారంలోకి వచ్చాక మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసారాలపై ఆంక్షల నేపథ్యంలో పత్రికలు, టీవీ చానెళ్లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు సైతం నిలిపివేయడంతో నెలనెలా జీతాలు చెల్లించడానికి సంకటంగా మారిందనీ, దాంతో యాజమాన్యాలు తమను తొలగించింయని ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం నిలిచిపోవడంతో ‘వక్త్ న్యూస్’టీవీ చానెల్ మూతపడడం గమనార్హం. నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో Whole of the Waqt News staff sacked and offices across Pakistan shut down. — Matiullah Jan (@Matiullahjan919) October 29, 2018 -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి) : వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైజల్,జిల్లా ఆధ్యక్షకార్యదర్శులు మల్లికార్జున్ రెడ్డి,విష్ణు ప్రసాద్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పట్టణంలోని ఐబీలో స్థానిక జర్నలిస్టులతో కలిసి జర్నలిస్టుల గర్జన గోడ పత్రిక,కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాలలో పని చేస్తున్న జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. ఉద్యమ వార్తలను, ఉద్యమకారుల ఆందోళన, నిరసనను ప్రభుత్వానికి చాటి చెప్పడానికి విలేకరులు ఎంతోగానో శ్రమించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న ఇప్పటి వరకు జర్నలిస్టుల న్యాయ పరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 28వ తేదీన ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో జర్నలిస్టుల గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉల్లిగడ్డల శివకుమార్, హాజీ, నరేశ్, విజయ్, నెల్లి శ్రీనివాస్, సిద్ధు, బుచ్చయ్య, నర్సిములు, లింగం, శేఖర్, శివకుమార్ గౌడ్, నగేశ్, చిరు, మహేశ్, విశ్వనాథం పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
తెలకపల్లి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రెడ్డెపాకుల రమేష్, శంకర్లు అన్నారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జర్నలిస్టులకు తెలంగాణవ్యాప్తంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని, 239 జీఓ ప్రకారం జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లతోపాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులందరికీ 300 గజాల స్థలంలో రూ.7లక్షల 50వేలతో ట్రిపుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలన్నారు. సంక్షేమ నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శంకర్, చిలుక శేఖర్‌రెడ్డి, రవి, తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సమస్యలపై 10 నుంచి రిలే దీక్షలు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 10వ తేదీ నుంచి వారంపాటు ఇందిరాపార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య విలేకరులకు తెలిపారు. డిసెంబర్ 4న అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల ఉద్యోగభద్రతపై రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, 5న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను 2015 జనవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.