జర్నలిస్టుల సమస్యలపై 10 నుంచి రిలే దీక్షలు | Riley strikes to be started on Journalists issues from Nov 10 | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సమస్యలపై 10 నుంచి రిలే దీక్షలు

Published Wed, Oct 29 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

Riley strikes to be started on Journalists issues from Nov 10

సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 10వ తేదీ నుంచి వారంపాటు ఇందిరాపార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను  అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య విలేకరులకు తెలిపారు. డిసెంబర్ 4న అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల ఉద్యోగభద్రతపై రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, 5న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను 2015 జనవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement