సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్ నేతుల నిరసనలు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మరోవైపు.. ఇందిరా పార్క్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎన్‌ఎంలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్దకు చేరుకుని.. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్బంగా పలువురు ఏఎన్‌ఎంలకు గాయాలయ్యాయి. మహిళా ఏఎన్‌ఎంలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే, గత కొంతకాలంగా వారిని పర్మినెంట్ చేయాలని ఏఎన్‌ఎంలు ఆందోళన చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు
Comments
Please login to add a commentAdd a comment