Apple Pakoda: Instagram Influencer Makes Apple Pakodas, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Apple Pakoda: యాపిల్‌ పకోడీ అట! ఓరి నీ యేషాలో..

Published Fri, Dec 17 2021 4:33 PM | Last Updated on Fri, Dec 17 2021 4:58 PM

Instagram Influencer Makes Apple Pakodas Viral video - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్నెట్‌ అనేది ఒక వింతల పుట్ట. ఎవరి బుర్రలో తోచింది వారు క్రియేటివ్‌ అమల్లో పెట్టి  సోషల్‌మీడియాలో వైరల్‌  అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ  ప్రపంచంలోని జ‌రిగే వింత‌లు, విశేషాలు, గందరగోళాలు క్షణాల్లో మన కళ్ల ముందుటున్నాయి. ఇటీవలికాలంలో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌లు కొత్త ట్రెండ్‌.. తాజాగా యాపిల్ ప‌కోడీ అంటూ  వింత వీడియో ఒకటి హల్‌ చల్‌ చేస్తోంది.  అదేంటి యాపిల్‌ పకోడీ అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ వీడియో మీకోసమే.

అదేదో సినిమాలో బంగాళా బౌబౌ అంటూ జంధ్యాల గిలిగింతలు  గుర్తున్నాయా? ఇటీవలికాలంలో ఫాంటా మ్యాగీ, కుల్డ్‌ మోమోస్‌, ఓరియో ప‌కోడా అంటూ ర‌క‌ర‌కాల వంట‌కాల వీడియోల‌ను చూశాం.  అలాగే పానీపూరీ ఐస్‌క్రీమ్‌, మోమోస్ ప‌రాటా లాంటివీడియోలను ఎంజాయ్‌ చేశాం.  మిర్చీ , పకోడీ  చేసినట్టుగా యాపిల్ ప‌కోడీతో ట్రెండింగ్‌లోకి  వచ్చాడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్.  

వీడియోలో, ఫుడ్ వ్లాగర్ యాపిల్‌లను ముక్కలుగా చేసి , దానిని పిండిలో ముంచి, ఆ తరువాత వేడి నూనెలో వేయించాడు. కాసేపు వేయించిన తర్వాత, దానిని టేస్ట్‌ చేసి  “యమ్మీ”  అంటూ లొట్ట లేయడం ఈ వీడియోలు చూడొచ్చు. ఈ స‌రికొత్త వంట‌కాన్ని చేసి త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కొంతమంది ఫుడ్‌ లవర్స్‌ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంటే కొంతమంది నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తుండటం విశేషం. ఈ వీడియో 7400 కంటే ఎక్కువ లైక్‌లు, అనేక కామెంట్లను సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement