
వేడి వేడి పకోడి...
ఇంటిప్స్
♦ బియ్యాన్ని నానబెట్టి రుబ్బి సెనగపిండిలో కలిపి పకోడీలు వేస్తే కరకరలాడటమే కాకుండా రుచిగా ఉంటాయి.
♦ మామూలు పెనంపై కొద్దిగా ఉప్పు వేసి వేడిచేసి, ఆ తర్వాత ఆ ఉప్పును తీసేయాలి. తర్వాత నూనె రుద్ది.. దోసె, అట్లు లాంటివి వేస్తే నాన్‌స్టిక్ పాన్‌లా పనిచేస్తుంది.
♦ పాలు మాడువాసన వస్తే రెండు తమలపాకులు వేసి కాసేపు వేడిచేయాలి.
♦ పచ్చళ్లు బూజు పట్టకుండా ఉండాలంటే చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి జాడీలో పెట్టి పైన మూత ఉంచాలి. అరగంట తర్వాత జాడీలో నుంచి ఇంగువ ముక్కను తీసేయాలి.