సాక్షి, హైదరాబాద్ : పచ్చి మిర్చి ధర మండిపోతోంది. ప్రధాన మార్కెట్‌లో వారం రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ. 40– 50 ఉండగా.. ప్రస్తుతం రూ.80– 100 పలుకుతోంది. గుడిమల్కాపూర్ బోయిన్‌ల్లి మాదన్నపేట ఎల్బీనగర్ మార్కెట్లతో పాటు రైతు బజార్లకు సైతం సరఫరా బాగా తగ్గింది. దీంతో నగర అవసరాలకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.
శివారు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో పచ్చిమిర్చి దిగుబడి తగ్గడంతో నగర మార్కెట్ భారీగా దిగుమతులు తగ్గాయి. మరోవైపు తర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరగడంతో టాన్స్‌పోర్టు ఖర్చు కూడా ఎక్కువ కావడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పారు. బుధవారం నగరానికి కేవలం 900 క్వింటాళ్ల పచ్చిమిర్చి మాత్రమే రావడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. అదే మాములు రోజుల్లో రోజూ మార్కెట్లకు 1800– 2000 క్వింటాళ్ల పచ్చిమిర్చి దిగుమతి అయ్యేదని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. (క్లిక్: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!)
Comments
Please login to add a commentAdd a comment