ఎన్నికల్లో పోటీ చెయ్యను.. రాహుల్‌కు ప్రియా లేఖ | I Dont Want To Contest In Lok Sabha Elections Says Priya Datt | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యను ప్రియా దత్‌

Published Mon, Jan 7 2019 11:32 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

I Dont Want To Contest In Lok Sabha Elections Says Priya Datt - Sakshi

సాక్షి, ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచెయ్యడానికి తనకు ఆసక్తిలేదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ప్రియా దత్‌ తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆదివారం లేఖ రాశారు. పోటీచెయ్యకపోవడానికి తగిన కారణాలను మాత్రం ఆమె లేఖలో వివరించలేదు. గత కొంతకాలంగా రాహుల్‌ గాంధీ టీమ్‌పై వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత సొంత పార్టీ నేతలపైనే ఆమె ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి సునీల్‌ దత్‌ కుమారైన ప్రియా.. ముంబై నార్త్‌ వెస్ట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 09 ఎన్నికల్లో విజయం తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పూనం మహజన్‌పై ఆమె ఓటమి పాలైయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు ప్రియా సొంత సోదరి. ప్రస్తుతం ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement