తల్లికి మొదటి ప్రాధాన్యత.. ఏక్‌నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం | Mother's First Name Mandatory For All Govt Documents In Maharashtra | Sakshi
Sakshi News home page

తల్లికి మొదటి ప్రాధాన్యత.. ఏక్‌నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం

Published Tue, Mar 12 2024 9:34 PM | Last Updated on Wed, Mar 13 2024 10:31 AM

Mother First Name Mandatory For All Govt Documents in Maharashtra  - Sakshi

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది మే 1 నుండి అమలు కానుంది.

2014 మే 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారు తప్పకుండా వ్యక్తి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు ఆ తరువాత ఇంటిపేరు వచ్చేలా కొత్త ఫార్మాట్ పాటించాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మంగళవారం తమ తల్లి పేరు ఉన్న నేమ్‌ప్లేట్‌లను చూపించారు. అయితే.. అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యతను కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement