
ముంబై: దేశంలో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను విడతలవారీగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఏక్‌నాథ్ షిండే' నేతృత్వంలోని శివసేన తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎనిమిది మందిని మాత్రమే ప్రకటించింది. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన 'రాజు పర్వే'ను రామ్‌టెక్ బరిలో దింపారు. ముంబై సౌత్ సెంట్రల్ నుంచి రాహుల్ షెవాలే, కొల్హాపూర్ నుంచి సంజయ్ మాండ్లిక్, షిర్డీ నుంచి సదాశివ్ లోఖండే, బుల్దానా నుంచి ప్రతాపరావు జాదవ్, హింగోలి నుంచి హేమంత్ పాటిల్, మావాల్ నుంచి శ్రీరంగ్ బర్నే, హత్కనంగలే నుంచి ధైర్యషీల్ మానే పోటీ చేయనున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఏక్‌నాథ్ షిండే నాయకత్వం.. పార్టీలో చేరడానికి తనను ప్రేరేపించిందని, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని గోవిందా అన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు దశల్లో జరగనున్నాయి. శివసేన ఎన్‌డీఏలో భాగం.
लोकसभा निवडणूक २०२४ साठी #शिवसेना पक्षाच्या अधिकृत उमेदवारांची पहिली यादी....#Maharashtra #Shivsena #Mahayuti #LoksabhaElections2024 #EknathShinde@Shivsenaofc pic.twitter.com/LntehqRlmI
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) March 28, 2024
Comments
Please login to add a commentAdd a comment