Sivsena
-
మహా పోరులో తెలుగోడి ఢంకా : బాబాయ్- అబ్బాయ్‌ల గెలుపోటములు తీరిదీ!
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్‌కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు. మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు! -
శివసేన తొలి జాబితా - లోక్‌సభ అభ్యర్థులు వీరే..
ముంబై: దేశంలో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను విడతలవారీగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఏక్నాథ్ షిండే' నేతృత్వంలోని శివసేన తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఎనిమిది మందిని మాత్రమే ప్రకటించింది. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన 'రాజు పర్వే'ను రామ్‌టెక్ బరిలో దింపారు. ముంబై సౌత్ సెంట్రల్ నుంచి రాహుల్ షెవాలే, కొల్హాపూర్ నుంచి సంజయ్ మాండ్లిక్, షిర్డీ నుంచి సదాశివ్ లోఖండే, బుల్దానా నుంచి ప్రతాపరావు జాదవ్, హింగోలి నుంచి హేమంత్ పాటిల్, మావాల్ నుంచి శ్రీరంగ్ బర్నే, హత్కనంగలే నుంచి ధైర్యషీల్ మానే పోటీ చేయనున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే నాయకత్వం.. పార్టీలో చేరడానికి తనను ప్రేరేపించిందని, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని గోవిందా అన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు దశల్లో జరగనున్నాయి. శివసేన ఎన్డీఏలో భాగం. लोकसभा निवडणूक २०२४ साठी #शिवसेना पक्षाच्या अधिकृत उमेदवारांची पहिली यादी....#Maharashtra #Shivsena #Mahayuti #LoksabhaElections2024 #EknathShinde@Shivsenaofc pic.twitter.com/LntehqRlmI — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) March 28, 2024 -
'భారత మాతాకీ జై అంటే సమస్యలు పరిష్కారం కావు: శివసేన
ముంబై: 'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సత్వరచర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'భారతమాతాకీ జై' అని నినదిస్తూ తన సీటును కాపాడుకోలేరని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటుగా విమర్శించింది. గత ప్రభుత్వాలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమేనని తెలిపింది. యువతలో అసహనం పెరిగి మావోయిజం వైపు ఆకర్షితులవుతున్నారని ఇలాంటి పరిసితుల్లో 'భారత మాతాకీ జై' అనే నినాదాలు చేస్తే లాభం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది. ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 రోజులకొకసారి కూడా తాగునీరు రావడంలేదని, పుణే, థానె, నాగపూర్, ముంబైల్లో పరిస్థితి దారుణంగా ఉందని రాష్ట్రం స్మశానాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలు మూతపడుతున్నాయని, దేశభక్తి పేరుతో ప్రజల దాహం తీర్చలేమంటే సహించేదిలేదని హెచ్చరించింది.