Mother name
-
తల్లికి మొదటి ప్రాధాన్యత.. ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది మే 1 నుండి అమలు కానుంది. 2014 మే 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారు తప్పకుండా వ్యక్తి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు ఆ తరువాత ఇంటిపేరు వచ్చేలా కొత్త ఫార్మాట్ పాటించాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మంగళవారం తమ తల్లి పేరు ఉన్న నేమ్ప్లేట్లను చూపించారు. అయితే.. అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఉంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యతను కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. एकनाथ गंगुबाई संभाजी शिंदे...! आई एक नाव असतं... घरातल्या घरात गजबजलेलं गाव असतं... कवी फ.मु. शिंदे यांच्या कवितेच्या ओळींमधून आईची महती आपल्याला समजते. आपल्याला जन्म देण्यापासून आपल्याला मोठे करण्यात ज्या माऊलीचा सिंहाचा वाटा असतो तिला तिचं श्रेय देण्याचा ऐतिहासिक निर्णय राज्य… pic.twitter.com/PTEJt4AGii — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) March 12, 2024 -
గుర్తింపు కార్డుల్లో అమ్మ పేరు కోసం...
‘అమ్మ పేరు’ కోసం ఓ కొడుకు చేసిన పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి ఏడేళ్లుగా అతడు అలుపెరగని ఫైట్ చేశాడు. ఎట్టకేలకు విజయం సాధించి ‘అమ్మ పేరు’ను సార్థకం చేశాడు. అతడి పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో లింగ్విస్టిక్ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏళ్ల సువామ్ పోరాట పటిమను ‘హిందూ’ వెలుగులోకి తెచ్చింది. సుదీర్ఘ పోరాటం సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతడి రెండేళ్ల వయసులో విడిపోయారు. అతని తండ్రి నేపాల్‌కు చెందినవాడు, తల్లి బీహార్‌లోని భాగల్పూర్ ప్రాంతవాసి. కోల్‌కతాలో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత, సువామ్ తన తండ్రి పేరు లేకుండా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) కోసం తన స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించినప్పుడు.. బహుశా అతడు అనుకుని ఉండడు ఈ పోరాటం చాలా కాలం సాగుతుందని. అతడు ఊహించనట్టుగానే జరిగింది. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు అతడు సుదీర్ఘ పోరాటం చేశాడు. చాలా చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. అయితే, 2015 -2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అడ్డంకులు తలెత్తాయి. ఫిబ్రవరి 11న పాన్‌కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది. పాన్‌కార్డులో తన తల్లి పేరు చూసి ఆనందంతో అల్లంత దూరన ఉన్న అమ్మతో సంతోషాన్ని పంచుకున్నాడు. సిన్హా తల్లి నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా అతడు వెనుకడుగు వేయలేదు. తండ్రి పేరే కొలమానమా? ‘తండ్రి పేరు మాత్రమే గుర్తింపు కొలమానంగా ఎందుకు ఉండాలి. మా నాన్న నా జీవితంలో ఎప్పుడూ లేడు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పే సువామ్ సిన్హా... తన గుర్తింపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రుల సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా వినతులు పంపాడు. సింగిల్ పేరెంట్స్ అభ్యర్థనల మేరకు పాస్‌పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్‌కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేయలేదు. సువామ్ సిన్హా ఇ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్‌కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును లిఖించి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హాను నెటిజన్లు మనసారా మెచ్చుకుంటున్నారు. -
తల్లి పేరుపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: చిన్నారులకు సంబంధించిన అధికారిక పత్రాలు, అఫిడవిట్లలో తల్లి పేరుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్పందన కోరుతూ బుధవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అధికారిక పత్రాల్లో తండ్రి పేరు రాయడం తప్పనిసరి చేసినా.. తల్లి పేరును ఆప్షనల్‌గా పేర్కొంటున్నారని, దీన్నీ తప్పనిసరి చేయాలని కోరుతూ జర్నలిస్ట్ మాధవ్‌కాంత్ మిశ్రా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇది మంచి విషయమని, మహిళల హక్కుల దిశగా ముందడుగని పేర్కొంది. -
'అమ్మ' పేరు చేర్చి గుర్తింపివ్వండి
-
అన్ని సర్టిఫికెట్లలో అమ్మ పేరు తప్పనిసరి
' దరఖాస్తు ఫారాల్లోనే అవకాశం కల్పించాలి ' యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు యూజీసీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: విద్యా సంబంధిత డిగ్రీలు, ఇతర అన్ని సర్టిఫికెట్లలో తల్లి పేరును తప్పనిసరిగా చేర్చాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లలోనే కాకుండా వివిధ కోర్సుల దరఖాస్తు ఫారాల్లోనూ తల్లి పేరు రాసే కాలమ్ ఉంచాలని పేర్కొంది. దరఖాస్తు ఫారాలు, సర్టిఫికెట్లలో విద్యార్థి ఇంటి పేరు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు స్పష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని యూజీసీ ఇన్చార్జి సెక్రటరీ ఉపమన్యు బసు వీసీలకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త డిగ్రీలకు యూజీసీ అనుమతి ఉండాల్సిందే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించని డిగ్రీలను ఏ యూనివర్సిటీ కూడా నిర్వహించడానికి వీలులేదని, అలాంటి డిగ్రీలను ఇవ్వరాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించరాదని సూచిస్తూ వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డిగ్రీని ప్రవేశపెట్టాలనుకుంటే ఆరు నెలల ముందుగా యూజీసీకి దర ఖాస్తు చేసుకుని గుర్తింపు పొందాలని సూచించింది.