తల్లి పేరుపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు | SC notice to states, UTs on plea for mother's name on documents | Sakshi
Sakshi News home page

తల్లి పేరుపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Published Thu, Jul 17 2014 4:21 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

తల్లి పేరుపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు - Sakshi

తల్లి పేరుపై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: చిన్నారులకు సంబంధించిన అధికారిక పత్రాలు, అఫిడవిట్లలో తల్లి పేరుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్పందన కోరుతూ బుధవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ప్రస్తుతం అధికారిక పత్రాల్లో తండ్రి పేరు రాయడం తప్పనిసరి చేసినా.. తల్లి పేరును ఆప్షనల్‌గా పేర్కొంటున్నారని, దీన్నీ తప్పనిసరి చేయాలని కోరుతూ జర్నలిస్ట్ మాధవ్‌కాంత్ మిశ్రా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇది మంచి విషయమని, మహిళల హక్కుల దిశగా ముందడుగని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement