ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్‌పూల్‌లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు.
‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్‌నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు.
ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment