ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉన్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్ మండిపడ్డారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన(ఉద్ధవ్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు.
ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్‌నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment