సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి బి-టౌన్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరో, సీనియర్ నటుడు గోవిందా స్పందిస్తూ.. ‘డైరెక్టర్ ఇస్మాయిల్ మరణం నాకెంతో బాధను కలిగిస్తోంది. నా సినీ కెరీర్ ఆయనతోనే మొదలైంది.
చదవండి: నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో..
నా మీద నమ్మకం ఉంచిన మొదటి వ్యక్తి ఆయనే. ఓ సామాన్యుడైన గోవింద్‌ను స్టార్ హీరో గోవిందగా మారటంలో ఇస్మాయిల్ ష్రాఫ్ సార్ ప్రముఖ పాత్ర పోషించారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఇస్మాయిల్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ‘అగర్’ సినిమాతో దర్శకుడిగా మారారు. తోడీసీ బేవఫాయ్, బులంది, అహిస్ట అహిస్ట వంటి హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 2004లో చివరిగా ‘తోడా తుమ్ బద్‌లో తోడా హమ్’ అనే సినిమా దర్శకుడిగా పనిచేశారు.
చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment