గోవిందా కుమారుడికి కారు ప్రమాదం | Govinda Son Yashvardhan Ahuja Escapes From Car Accidents | Sakshi
Sakshi News home page

గోవిందా కుమారుడికి కారు ప్రమాదం

Jun 26 2020 8:17 AM | Updated on Jun 26 2020 8:55 AM

Govinda Son Yashvardhan Ahuja Escapes From Car Accidents - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు గోవింద కుమారుడు యశ్వర్ధన్ ఇటీవల ముంబైలోని జుహులో కారు ప్రమాదానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కారులో యశ్వర్ధన్‌తో పాటు అతడి డ్రైవర్‌ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  ఈ నెల 2వ తేదీ రాత్రి ఓ పార్టీ నుంచి తిరిగి వెళ్తుండగా జూహు వద్ద యశ్‌రాజ్‌ ఫిలింస్‌ (వైఆర్‌ఎఫ్‌)కు చెందిన ఫ్యార్చ్యున్‌ కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని జూహు పొలీసులు తెలిపారు. (ఇది అన్యాయం)

కాగా ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో సంఘటన స్థలంలోనే ఇరువర్గాలు చర్చించుకుని పరిష్కరించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గోవింద, సునీతా అహుజాకు కూమార్తె టీనా, కుమారుడు యశ్వవర్థన్‌లు ఉన్నారు. కాగా  గోవింద 2018లో విడుదలైన ‘ఫ్రైడే’, ‘రంగీలా రాజా’ చిత్రాలలో నటించారు. అలాగే పలు టీవీ కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement