అంకుల్‌... ఇరగదీశావ్‌ పో! | Indian Uncle Govinda Style Dancing Video Viral | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 1 2018 8:02 AM | Last Updated on Fri, Jun 1 2018 9:57 AM

Indian Uncle Govinda Style Dancing Video Viral - Sakshi

వీడియోలో దృశ్యం ఆధారంగా...

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏదైనా హల్‌ చల్‌ చేస్తుందంటే చాలూ.. అది వార్తగా మారిపోతోంది. తాజాగా ఇండియన్‌ అంకుల్‌ డాన్స్‌ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 40 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఏదో వేడుకలో స్టేజీపై వేసిన స్టెప్పులకు ఇప్పుడు అంతా ముగ్ధులైపోతున్నారు. జితేంద్ర, శతృఘ్నసిన్హా, గోవిందా కాంబోలో వచ్చిన ఖుద్‌గర్జ్‌(1987) చిత్రంలోని ‘ఆప్‌ కే ఆ జానే సే...’  పాటకు ఆ వ్యక్తి డాన్స్‌ చేశాడు. అచ్చం గోవిందాను ఇమిటేట్‌ చేస్తూ అతను చేసిన డాన్సింగ్‌ మూమెంట్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. పక్కన ఉన్న ఆంటీ మాత్రం పాపం ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయింది. మ్యాజిక్‌ స్టెప్పులకు పేరున్న గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ వీడియోను సర్క్యూలేట్‌ చేస్తున్నారు. అఫ్‌ కోర్స్‌ గత రెండు రోజులుగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌.. ఇలా ఏ ఫోన్‌లలో ఎక్కడ చూసినా ఈ అంకుల్‌ సందండే. కానీ, ఇది ఎక్కడ జరిగింది? అసలా అంకుల్‌ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. అఫ్‌కోర్స్‌ అది బయటపడటానికి కూడా పెద్దగా సమయం పట్టకపోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement