
సాక్షి, న్యూఢిల్లీ : మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? అదేనండి గతేడాదిలొ గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్‌కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్‌గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు. అయితే ఈ సారి ఆయన ఒక మ్యూజిక్ ఆల్బంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వీడియోకి ‘ చాచా నాచ్’ అనే పేరు పెట్టారు. దీనిని ఇటీవలే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా లక్ష మందికి పైగా వీక్షించారు.(అంకుల్... ఇరగదీశావ్ పో!)
Comments
Please login to add a commentAdd a comment