
మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్‌కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్‌గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు.
1988లో రిలీజ్ అయిన 'జీతే హై హమ్ షాన్' సినిమాలో మితున్ చక్రవర్తి నటించిన 'జూలీ జూలీ' పాటకు స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు సంజీవ్. ఇటీవల ఓ పెళ్లికి హాజరైన ఆయన వేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అయింది. చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘డ్యాన్సింగ్ అంకుల్ ఈజ్ బ్యాక్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి
అంకుల్... ఇరగదీశావ్ పో!
Comments
Please login to add a commentAdd a comment