ప్రచారంలో సీనియర్‌ హీరో స్టెప్పులు! | Actor Govinda Dances In Election Campaign For Shiv Sena Candidate In Pune, Video Viral | Sakshi
Sakshi News home page

ప్రచారంలో సీనియర్‌ హీరో గోవిందా స్టెప్పులు!

Published Thu, May 9 2024 9:03 AM

Govinda Dances Election Campaign Shiv Sena

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్‌ హీరో గోవిందా తళుక్కున మెరిశారు. దశాబ్దకాలం తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గోవిందా ఎన్నికల ప్రచార వేదికపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.

ఆయన డ్యాన్స్‌ను చూసిన శివసేన నేతలు కూడా ఉత్పాహంగా ఆయనతోపాటు కాలు కదుపుతున్నారు. గోవిందా స్టైల్‌, ఉత్సాహం మునుపటిలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి గోవిందా కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్‌ను ఓడించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Video Credits: News24
తాజాగా గోవిందా గత మార్చి లో శివసేనలో చేరారు. ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి గోవిందా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే ముంబై నార్త్‌వెస్ట్‌ నుంచి ఆయనను శివసేన ఎన్నికల బరిలోకి దింపవచ్చనే టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement