కృతజ్ఞతతో ఉంటా! | Govinda has a new fan in Kill Dill co-star Ranveer Singh | Sakshi
Sakshi News home page

కృతజ్ఞతతో ఉంటా!

Published Tue, Feb 18 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

కృతజ్ఞతతో ఉంటా!

కృతజ్ఞతతో ఉంటా!

 సీనియర్ నటుడు గోవిందా అంటే రణ్‌వీర్‌సింగ్‌కు చెప్పలేనంత అభిమానం. కొన్ని కొన్ని సినిమాల్లో గోవిందా నటనను అనుకరించాడు కూడా. ఈ విషయమై గోవిందా మాట్లాడుతూ అటువంటి యువతరం కథానాయకులపట్ల తాను కృతజ్ఞతతో ఉంటానన్నాడు. తన నృత్యశైలిని అనుకరించడం ఎంతో ఆనందం కలిగిస్తుందన్నాడు. కాగా షాద్ అలీ రూపొందిస్తున్న ‘కిల్ దిల్’ సినిమాలో గోవిందాతో కలసి రణ్‌వీర్ స్టెప్పులు వేయనున్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘గోలియోంకీ రాస్‌లీలా రాంలీలా’ సినిమాలో గోవిందా తరహాలోనే రణ్‌వీర్ నృత్యం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పురస్కార ప్రదాన కార్యక్రమంలోనూ గోవిందా మాదిరిగానే నర్తించాడు. యువప్రతిభను ప్రశంసిస్తూ ‘అవును. 
 
 రాంలీలా సినిమాలో ఇష్కియా డిష్కియా పాటకు రణ్‌వీర్ వేసిన స్టెప్పులు చూశా. ఎంతో బాగా చేశాడు. పూర్తిగా ఫాంలో ఉన్నాడు. నా శైలి విలువైనదని భావించి దానిని అనుకరించొచ్చని భావించేవారిపట్ల కృతజ్ఞతతో ఉంటా’ అని అన్నాడు. గోవిందా, రణ్‌వీర్ కాంబినేషన్‌లో షాద్‌అలీ త్వరలో ఓ సినిమా తీయనున్నాడు. దీంతో వీరిరువురి స్టెప్పులను అభిమానులు పోల్చిచూసుకునే అవకాశం లభిస్తుందని ‘కిల్ దిల్’ సినిమావర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంచితే  గోవిందా ఇటీవల కొద్దిగా బరువు తగ్గాడు. కిల్ దిల్ సినిమాలో గోవిందా తొలిసారిగా ప్రతి నాయకుడి పాత్ర పోషించబోతున్నాడు. ‘ఇది నేను తొలిసారిగా పూర్తిస్థాయిలో నటిస్తున్న ప్రతినాయకుడి పాత్ర. కొన్నేళ్ల క్రితం షికారి సినిమాలో విలన్ పాత్ర పోషించా. అయితే అది చిన పాత్ర మాత్రమే’ అని చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement