Ranveer Singh Breaks Down Tears After Met Govinda On The Big Picture Show- Sakshi
Sakshi News home page

Ranveer Singh: ప్రముఖ హీరోను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రణ్‌వీర్‌ సింగ్

Published Sun, Jan 2 2022 5:38 PM | Last Updated on Sun, Jan 2 2022 5:47 PM

Ranveer Singh Breaks Down Tears After Met Govinda - Sakshi

Ranveer Singh Breaks Down Tears After Met Govinda: బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షాదరణ పొందుతుంది. ముఖ్యంగా కపిల్ దేవ్‌లా డిట్టు దింపేసినా రణ్‌వీర్‌ సింగ్‌ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రణ్‌వీర్ సింగ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల కలర్స్‌ అందిస్తున్న 'ది బిగ్ పిక్చర్‌' రియాలిటీ షోను హోస్ట్‌ చేశాడు రణ్‌వీర్. 

ఈ షోకు హాజరైన ప్రముఖ నటుడు గోవిందాను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు రణ్‌వీర్‌ సింగ్‌. తర్వాత రణ్‌వీర్‌ను ఓదార్చాడు గోవిందా. ఈ షోలో ప్రేక్షకులకు గోవిందాను పరిచయం చేస్తూ 'ఈ శుభ దినాన నా దేవుడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. ది వన్‌ అండ్‌ ఓన్లీ , హీరో నెంబర్‌ వన్ గోవిందా' అంటూ స్టేజిపైకి ఆహ్వానించాడు. అనంతరం రణ్‌వీర్‌ సింగ్.. గోవిందా కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రణ్‌వీర్‌ సింగ్‌ అభిమానాన్ని చూసిన గోవిందా సంతోషపడ్డాడు. తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్క్‌ హై సుహానా, యూపీ వాలా తుమ్కా వంటి గోవిందా హిట్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ఈ పోగ్రామ్‌లో గోవిందా భార్య సునీత, కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్‌ అహుజా వీడియో కాల్‌ ద్వారా పాల్గొన్నారు. 
 

ఇదీ చదవండి:  83 చిత్రంపై రజనీ కాంత్‌ రియాక్షన్‌.. పొగడ్తలతో బౌండరీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement