భార్యకు కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు | Actor Govinda Gifts Wife Sunita Ahuja A BMW Car On Karwa Chauth | Sakshi
Sakshi News home page

Govinda Gifts BMW Car To Wife: భార్యకు కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన గోవింద

Published Mon, Oct 25 2021 6:19 PM | Last Updated on Mon, Oct 25 2021 7:40 PM

Actor Govinda Gifts Wife Sunita Ahuja A BMW Car On Karwa Chauth - Sakshi

Actor Govinda Gifted Costly BMW Car To His Wife Sunith Ahuja On Karwa Chauth: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గోవింద ఆయన భార్య సునీత ఆహుజాకు ఓ బహుమతి ఇచ్చాడు. కర్వాచౌత్‌ పండుగ వేడుకలో భాగంగా సతీమణికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కానుకగా అందించాడు. ఈ మేరకు భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారుతో దిగిన ఫొటోను షేర్‌ చేశాడు.

ఈ సందర్భంగా.. ‘నా ప్రాణ స్నేహితురాలు.. నా జీవిత భాగస్వామి. నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి.. నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా కర్వాచౌత్‌ను పురస్కరించుకుని ఒక చిన్న బహుమతిని అందిస్తున్నాను’ అంటూ తన ప్రేమను ఈ చిన్న గిఫ్ట్‌లో చూడమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు గోవింద. కాగా ఆయనతో పాటు పలువురు బాలీవుడ్‌ సినీ సెలబ్రెటీలు కూడా కర్వాచౌత్‌ పండుగను జరుపుకున్న ఫొటోలను షేర్‌ చేశారు. అందులో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, శిల్పా శెట్టి, వరుణ్‌ ధావన్‌, పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, మీరా కపూర్‌, కమెడియన్‌ కపిల్‌ శర్మ ఇతర నటీనటులు ఈ పండగ సెలబ్రెషన్స్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 

కర్వాచౌత్‌ అనగా.. 
ప్రతి ఏటా దీపావళికి పది రోజులు ముందు ఈ పండగ వస్తుంది. ఈ పండగను దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతదేశ ప్రజలు ఎక్కువగా జరపుకుంటారు. కర్వాచౌత్‌ను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి, కుటుంబ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉపవాస దీక్షకు పూనుకుంటారు. అలాగే భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజంతా మహిళలు ఏం తినకుండా ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. అలా ఏడాదిలో రెండు రోజులు కర్వాచౌత్‌ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ 24, 25 తేదీల్లో ఉత్తరాది మహిళలంత కర్వాచౌత్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement