![Govinda Says Wrote 16 Hit Songs Lyrics His Career In Peak Time - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/6/govinda1.jpg.webp?itok=IBEL0Wi8)
ఒకప్పటి బాలీవుడ్ హీరో గోవింద తెగ నవ్విస్తాడు... అనేదాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ‘ఆయన పాటలు ఏమైనా రాస్తాడా?’ అనే కొచ్చెనుకు మాత్రం డౌట్ల మీద డౌట్లు వస్తాయి. పాటలకు డ్యాన్స్‌లు చేసే హీరో పాటలెందుకు రాస్తాడు? మరీ అంతగా అయితే పాటలు పాడుతాడు గానీ....అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇటీవల ఒక రియాల్టీ షోకు గెస్ట్‌గా వచ్చాడు గోవింద.
ఆ షోలో 90’లలో తన సినిమాలలోని హిట్‌సాంగ్స్‌ను సింగర్స్ గానం చేస్తున్నప్పుడు గోవింద గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడమే కాదు... ‘నేను పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 15–16 హిట్‌సాంగ్స్ స్వయంగా రాశాను’ అని చెప్పాడు. అప్పట్లో బాగా పాపులర్ అయిన ‘దీవాన మస్తానా’ అనే డైలాగ్ కూడా ఆయన రాసినదేనట. ఇంతకీ ఆ 16 సాంగ్స్ ఏమిటంటారు? కాస్త పరిశోధించాల్సిందే సుమీ!
Comments
Please login to add a commentAdd a comment